Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran attacks | కువైట్, దుబాయ్​పై ఇరాన్ దాడులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran attacks | కువైట్, దుబాయ్​పై ఇరాన్ దాడులు

అంతర్జాతీయం

Iran attacks | కువైట్, దుబాయ్​పై ఇరాన్ దాడులు

కువైట్, దుబాయ్ పోర్టులపై ఇరాన్​ దాడులు చేసింది. భారీ ఎత్తున డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 11:37 ఉద.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Iran attacks

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran attacks | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్​ ఆపరేషన్​ ట్రూ ప్రామిస్​ 4 (Operation True Promise 4) పేరిట మరోసారి గల్ఫ్​ దేశాలపై విరుచుకుపడింది. కువైట్ (Kuwaot), దుబాయ్ పోర్టులపై పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో పలువురు అమెరికా సైనికులు మృతి చెందారు. మూడు అమెరికా నౌకలు సముద్రంలో మునిగిపోయాయి.

Contents
  • Iran attacks | ప్రతీకారం తీర్చుకుంటాం
    • Iran attacks | అమెరికన్​ సైనికుల మృతి

అమెరికా సైనిక స్థావరాలు, వాటి ఆస్తులపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ట్రూ ప్రామిస్ 4 ఆపరేషన్ ప్రారంభించింది. అమెరికాకు చెందిన అనేక భారీ పరిశ్రమలపై క్షిపణి, డ్రోన్ దాడులు జరిగాయని, వాటిలోని కొన్ని భాగాలు ధ్వంసమైనట్లు ఇరాన్​ ప్రకటించింది. ఆపరేషన్ సమయంలో అమెరికా యుద్ధ విమానాలు తమ లాంచ్​పాడ్​లపై దాడికి యత్నించినట్లు ఐఆర్​జీసీ పేర్కొంది. అయితే అమెరికన్ MQ9 మానవరహిత విమానాన్ని తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని చెప్పింది. ఫార్స్ ప్రావిన్స్ దక్షిణ ప్రాంతంలో ఒక అమెరికన్ F-16 యుద్ధ విమానం దెబ్బతిని, సౌదీ అరేబియాలోని ఒక విమానాశ్రయంలో దిగకముందే ధ్వంసమైందని ఇరాన్​ తెలిపింది.

Iran attacks | ప్రతీకారం తీర్చుకుంటాం

పారిశ్రామిక లక్ష్యాలపై దాడి చేసినందుకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా పాలకులను హెచ్చరించినట్లు ఇరాన్​ తెలిపింది. ఈ దాడి కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనని పేర్కొంది. తమ పరిశ్రమలపై దాడి పునరావృతమైతే తదుపరి ప్రతిస్పందన అంచనాలకు మించి ఉంటుందని హెచ్చరించింది.

Iran attacks | అమెరికన్​ సైనికుల మృతి

ఇరాన్​ దాడుల్లో భారీగా అమెరికన్​ సైనికులు మృతి చెందినట్లు సమాచారం. దుబాయ్‌లో మరణించిన, గాయపడిన అమెరికన్లను తరలించడానికి అంబులెన్సులు గంటల తరబడి తీరిక లేకుండా ఉన్నాయని ఇరాన్​ తెలిపింది. ఈ ప్రాంతం అమెరికా సైనికులకు శ్మశానవాటికగా మారుతుందని హెచ్చరించింది. ఇరాన్​ దాడుల్లో తమ సైనికులు చనిపోలేదని అమెరికా (America) ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వం సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేస్తోందని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పలు డ్రోన్ దాడులు జరిగాయి. దీంతో రాడార్ వ్యవస్థ దెబ్బతింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ దాడులను ఇరాన్, దాని అనుబంధ సంస్థలు, అది మద్దతు ఇచ్చే సాయుధ వర్గాలు జరిపాయని కువైట్ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు. భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కువైట్, బహ్రెయిన్‌తో సహా ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసి వేశారు.

దీనిని కూడా చదవండి : Iran US Tensions | భారీ సైన్యాన్ని దించిన అమెరికా.. “నరకానికి స్వాగతం” అంటూ ఇరాన్​ హెచ్చరిక.. తీవ్ర స్థాయికి యుద్ధం!

Iran US tensions | అమెరికాకి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే దానిని శాశ్వతంగా మూసివేస్తాం
Jeffrey Epstein Documentary | బాలికల మాంసం ముద్దలపై ఎప్‌స్టీన్ దుష్కృత్యాలు.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న భారీ సెక్స్​ కుంభకోణం..
Gulf Iran Tensions | గల్ఫ్‌ దేశాల నేతలతో ప్రధాని మోదీ చర్చలు
Iran Israel Conflict | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
PV Sindhu Returns | భారత్​కు చేరుకున్న పీవీ సింధు
TAGGED:drone missile strikesGulf conflict newsIran attacksKuwait Dubai attacksMiddle East Crisis
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article duster తెలంగాణలో సరికొత్త రెనాల్ట్ డస్టర్‌ను విడుదల చేసిన పీపీఎస్ మోటార్స్
Next Article Middle East war impact Middle East war impact | పశ్చిమాసియా యుద్ధం.. కండోమ్​ల తయారీపై ఎఫెక్ట్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?