అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk Driving Case | డ్రంకన్ డ్రైవ్ (drunk driving India) కేసులో పలువురికి జైలుశిక్ష విధిస్తూ (Nizamabad traffic police) నిజామాబాద్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు ట్రాఫిన్ ఏసీపీ మస్తాన్ అలీ వివరాలు వెల్లడించారు.
Drunk Driving Case | నగర పరిధిలో తనిఖీలు..
నగరంలోని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో (driving under influence) తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 41 మంది మద్యం తాగి వాహనాలు నడిపినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. విచారించిన మెజిస్ట్రేట్ హైమద్ మొహియుద్దీన్ ఆరుగురికి వారం రోజుల పాటు జైలుశిక్ష విధించారు. 35 మందికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున (law enforcement India) జరిమానాలు విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ.. డ్రంకన్ డ్రైవ్ (traffic violations news) నిబంధనలు కఠినంగా ఉన్నాయని.. మద్యం తాగి రోడ్లపైకి (road safety rules) వచ్చేముందు ఆలోచించుకోవాలని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో సరికొత్త రెనాల్ట్ డస్టర్‌ను విడుదల చేసిన పీపీఎస్ మోటార్స్
