అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaushik Reddy controversy | బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆదివారం పాడి కౌశిక్‌రెడ్డి అనుచిత ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari)ని తుపాకీతో కాల్చి చంపుతానని కౌశిక్ రెడ్డి బెదిరించరంటూ కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. సీనియర్ ఎమ్మెల్యేను వేలు చూపిస్తూ మాట్లాడటం సరికాదన్నారు. కౌశిక్‌రెడ్డి సభలో గూండాయిజం చేస్తున్నారని ఆరోపించార. ఈ క్రమంలో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.
Kaushik Reddy controversy | సస్పెండ్ చేయాలి
తండ్రి లాంటి కడియం శ్రీహరికి మర్యాద ఇవ్వకుండా మాట్లాడతారా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి (Yashaswini Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమాండ్లపై చర్చ జరుగుతుంటే సభా సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఎంతో కొంత నేర్చుకుందామని సభకు వస్తే కొత్త ఎమ్మెల్యేలకు మీరిచ్చే సందేశం ఇదేనా అన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి సభను స్పీకర్ ఆర్డర్లో పెట్టాలని ఆమె కోరారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి మనిషి పెరిగారు.. కానీ బుద్ది పెరగలేదని విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యులు శ్రీహరికి సారి చెప్పాలని మందుల సామేల్ డిమాండ్ చేశారు.
Kaushik Reddy controversy | దళితులంటే గౌరవం లేదు
బీఆర్ఎస్ నేతలకు దళితులంటే గౌరవం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కడియం శ్రీహరిపై వేలు చూపిస్తూ అవమానిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై ఇంకా ఎన్నాళ్లు గూండాయిజం చేస్తారన్నారు. దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అవమానించిన కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.
దీనిని కూడా చదవండి: Mahipal Reddy BRS | ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్లోకి వచ్చినట్టేనా!
