Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KTR land controversy | నా భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి ఇచ్చారు.. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - KTR land controversy | నా భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి ఇచ్చారు.. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ

KTR land controversy | నా భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి ఇచ్చారు.. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

మజీ మంత్రి కేటీఆర్​పై ఎమ్మెల్యే దానం నాగేందర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత భూమిని కేటీఆర్​ ఓ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 3:40 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
KTR land controversy

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR land controversy | మజీ మంత్రి కేటీఆర్​పై ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendhar)​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత భూమిని కేటీఆర్​ ఓ కంపెనీకి ఇచ్చారన్నారు.

బీఆర్​ఎస్​ (BRS) హయాంలో భారీగా భూ కబ్జాలు, ఆక్రమణలు జరిగాయాని దానం నాగేందర్​ ఆరోపించారు. తన తండ్ర కష్టపడి సంపాదించిన భూమిని తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు అన్ని ఉన్నాయన్నారు. కావాలంటే స్పీకర్​ ముందు ముందుపెడతానని చెప్పారు. హైదరాబాద్​లో పుట్టి పెరిగినా ఏం చేయలేక నోరు మూసుకున్నామన్నారు. తాము, తమ కుటుంబ సభ్యులం ఎంతగానో నష్టపోయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేల ఎకరాల భూ కబ్జాలు జరిగాయని ఆరోపించారు. వాటి అన్నింటిపైనా హౌస్ కమిటీ (House Committee) వేయాలని డిమాండ్ చేశారు.

KTR land controversy | రూ.200 కోట్ల భూమి కబ్జా

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం వరంగల్​ సిటీ సెంటర్లో 200 కోట్ల ప్రాపర్టీ కబ్జా (KTR land controversy | ) చేశారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సమాచార హక్కు చట్టం ప్రకారం ఆధారాలు తెచ్చి మాట్లాడుతున్నాని చెప్పారు. తాను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే 24 గంటల్లో పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. హరీశ్ రావు, కేటీఆర్​లకు దమ్ముంటే ఇది నిజం కాదని నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. కోట్లు కోట్లు కొల్లగొట్టిన దొంగలే దొంగ అని మొత్తుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయాల పేరిట విలువైన భూములను దోచుకున్నవారు ఈ రోజు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

రాష్ట్రంలో గత పదేండ్లు వేల ఎకరాల భూస్కాం జరిగింది. నా సొంత భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి ఇచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలు అన్ని ఉన్నాయి. కావాలంటే మీ ముందుపెడతా.

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నన్నుబిఆర్ఎస్ వాళ్ళు నోరు మూసుకొని ఉండేలా చేశారు. మేము, మా కుటుంబ సభ్యులం ఎంతగానో… pic.twitter.com/7vzCPNWzni

— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) March 29, 2026

దీనిని కూడా చదవండి : Kaushik Reddy controversy | ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డిపై ప్రభుత్వం సీరియస్​.. చర్యలు తీసుకునే అవకాశం

Digital Health Cards | ఉద్యోగులకు డిజిటల్​ హెల్త్​ కార్డులు
Attapur Hydraa Demolition | అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు
Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : హరీశ్​రావు
Babli Water Release | బాబ్లీ ప్రాజెక్ట్​ గేట్ల ఎత్తివేత
Moinabad Farmhouse Drugs Party | మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో కాల్పులు.. పోలీసులపై డ్రగ్గర్స్​ దాడి!
TAGGED:BRS PartyDanam NagenderHyderabad newsKTRLand Controversyproperty grab
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article National Lok Adalat | National Lok Adalat | జాతీయ లోక్​ అదాలత్​లో 5,662 కేసుల పరిష్కారం : సీపీ
Next Article North Korea North Korea | మరో ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా.. హై-థ్రస్ట్ మిస్సైల్ ఇంజిన్ పరీక్ష..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?