Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vijay driver son | డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చిన టీవీకే చీఫ్​ విజయ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Vijay driver son | డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చిన టీవీకే చీఫ్​ విజయ్​

జాతీయం

Vijay driver son | డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చిన టీవీకే చీఫ్​ విజయ్​

టీవీకే చీఫ్​ విజయ్​ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. తన మాజీ డ్రైవర్​ కుమారుడికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 6:42 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Vijay driver son

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay driver son | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అయితే అభ్యర్థుల్లో తన వ్యక్తిగత డ్రైవర్​ అయిన రాజేంద్రన్​ కుమారుడు శబరినాథన్‌కు విరుగంబాక్కం నియోజకవర్గం టికెట్​ కేటాయించారు. తనకు టికెట్​ ఇవ్వడంతో శబరినాథన్ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

Contents
  • Vijay driver son | డ్రైవర్​ నుంచి పీఏగా..
    • Vijay driver son | రెండు స్థానాల నుంచి..

తమిళనాడులో ఏప్రిల్​ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటాలని టీవీకే చీఫ్ విజయ్​ భావిస్తున్నారు. ఈ మేరకు 234 స్థానాల్లో ఆయన అభ్యర్థులను ప్రకటించారు. విజయ్​ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఆయన మాజీ డ్రైవర్, ప్రస్తుత పీఏ అయిన రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ (Sabarinathan)​కు కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వడం గమనార్హం. టికెట్ ప్రకటించగానే రాజేంద్రన్, ఆయన కుమారుడు శబరినాథన్​ భావోద్వేగానికి గురయ్యారు.

Vijay driver son | డ్రైవర్​ నుంచి పీఏగా..

రాజేంద్రన్ ప్రస్తుతం విజయ్​ పీఏగా కొనసాగుతున్నారు. ఆయన గతంలో చాలా కాలం పాటు విజయ్​ డ్రైవర్​గా పని చేశారు. విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి శబరినాథన్‌ను బరిలో నిలవనున్నారు. దీంతో శబరినాథన్ విజయ్ పాదాలకు నమస్కరించి, ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Vijay driver son | రెండు స్థానాల నుంచి..

ఎన్నికలలో తాను పెరంబూర్, తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ఆదివారం విజయ్ ప్రకటించారు. ప్రజలతో నిలబడే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేశానని చెప్పారు. ప్రస్తుతం తమిళనాడులో అధికార డీఎంకే (DMK), ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIDMK) మధ్య పోరు ఉండనున్నట్లు సమాచారం. అయితే టీవీకే ప్రభావం సైతం అధికంగా ఉండనుంది. కొన్ని స్థానాల్లో విజయం సాధించడంతో పాటు, మరికొన్ని స్థానాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

Naxalism Elimination India | నక్సలిజం నిర్మూలనపై అమిత్ షా కీలక ప్రకటన
Ethanol Usage India | ఇథనాల్​ వాడకంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Partial Lunar Eclipse | చంద్రగ్రహణం.. పాక్షికమే!
Small Notes ATM | ఇక ఏటీఎంల నుంచే చిన్న నోట్లు.. రూ.10, రూ.20, రూ.50 డ్రా చేసే కొత్త వ్యవస్థకు కేంద్రం సిద్ధం
LPG Booking Interval | గ్యాస్​ సిలిండర్ల బుకింగ్​పై కేంద్రం కీలక నిర్ణయం
TAGGED:driver son ticketelection newsIndian Politicstamil nadu electionsTVK partyVijay
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Alumni Reunion 1960 Batch | Alumni Reunion 1960 Batch | 66 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు..
Next Article Car Accident Gandhari | Car Accident Gandhari | అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరికి గాయాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?