Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Godavari Pushkaralu | గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Godavari Pushkaralu | గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష

తెలంగాణ

Godavari Pushkaralu | గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టాలన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 7:42 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Godavari Pushkaralu

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Godavari Pushkaralu | గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్షించారు. 2027 జూన్‌లో పుష్కరాలు జరగనున్నాయి. వీటిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి నుంచే ఏర్పాట్లపై చర్యలు చేపడుతోంది.

Contents
  • Godavari Pushkaralu | వార్​ రూమ్​ ఏర్పాటు
    • Godavari Pushkaralu | భక్తులకు ఇబ్బందులు లేకుండా..

పుష్కరాల కోసం బాసర (Basar) నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆలయాలు, పుష్కరఘాట్ల అభివృద్ధి కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపసంఘంతో పాటు అధికారులతో ఆదివారం సీఎం చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించడానికి ఇంజనీర్లతో టెక్నికల్ కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 20 రోజుల్లో నివేదికను సమర్పించాలన్నారు.

Godavari Pushkaralu | వార్​ రూమ్​ ఏర్పాటు

ఇంజనీర్ల కమిటీ నివేదికను పరిశీలించి, పూర్తి అంచనాలతో మంత్రివర్గ ఉప సంఘానికి పంపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉప సంఘం ఆమోదించిన తర్వాత పుష్కరాల సమగ్ర ప్రణాళికపై మంత్రిమండలి తుదినిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పుష్కరాల కోసం శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్‌లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

Godavari Pushkaralu | భక్తులకు ఇబ్బందులు లేకుండా..

ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల నిర్మాణం, విస్తరణ చేపట్టేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు కల్గకుండా చూడాలన్నారు. బాసర సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించగా, ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : KTR land controversy | నా భూమిని కేటీఆర్ ఓ కంపెనీకి ఇచ్చారు.. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత
Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి
Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
Hyderabad Gas Shortage | ఆ వంటలు చేయలేం.. గ్యాస్​ కొరతతో హాస్టళ్ల నిర్ణయం
Kukatpally Nalla Cheruvu | కూకట్​పల్లి నల్ల చెరువు ప్రారంభానికి ఏర్పాట్లు : హైడ్రా కమిషనర్
TAGGED:Godavari Pushkaralupushkaralu 2027Revanth ReddyTelangana Governmenttemple development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article TNGOs Leaders Felicitation | TNGOs Leaders Felicitation | టీఎన్జీవోస్​ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులకు ఘన సన్మానం
Next Article Rajagopal Reddy criticism Rajagopal Reddy criticism | ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి విమర్శలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?