అక్షరటుడే, వెబ్డెస్క్ : Mahalakshmi scheme savings | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో ఇప్పటి వరకు మహిళలు రూ.10 వేల కోట్లు ఆదా చేసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు.
పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు సుమారు 290 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు నమోదవగా, మహిళలు కలిసి దాదాపు రూ.10,000 కోట్ల రవాణా వ్యయాన్ని ఆదా చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడంతో పాటు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. గతంలో రవాణా కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రస్తుతం కుటుంబ అవసరాలు, విద్య, ఉపాధి అవకాశాల కోసం వినియోగించుకునే స్థితికి మహిళలు చేరుకోవడం ఈ పథక విజయానికి నిదర్శనమన్నారు.
Mahalakshmi scheme savings | లక్షలాది మంది మహిళలు
ఈ పథకం ద్వారా నిత్యం లక్షలాది మహిళలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని మంత్రి తెలిపారు. విద్య, ఉపాధి, వైద్య సేవలను పొందుతున్నారని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు సులభంగా ప్రయాణించే అవకాశాన్ని ఈ పథకం విస్తరించిందన్నారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ (TGSRTC) సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.
దీనిని కూడా చదవండి: heavy rain alert | రైతులకు అలెర్ట్.. మళ్లీ భారీ వర్ష సూచన
