అక్షరటుడే, వెబ్‌డెస్క్: Visakhapatnam Murder Case | ఆంధ్రప్రదేశ్‌లోని Visakhapatnamలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గాజువాక పరిధిలోని LV Nagarలో ఉంటున్న నేవీ ఉద్యోగి రవీంద్ర తన ప్రియురాలిని హతమార్చి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాచిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
Visakhapatnam Murder Case | డబ్బుల కోసం వేధింపులు..
పోలీసుల కథనం ప్రకారం.. రవీంద్రకు ఇప్పటికే వివాహం అయింది. భార్య ఉన్నప్పటికీ, మౌనిక (28) అనే వివాహితతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడు. ఇటీవల మౌనిక డబ్బుల కోసం ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తన భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మౌనికను రవీంద్ర తన ఇంటికి పిలిచినట్లు తెలుస్తోంది.
Visakhapatnam Murder Case | ఠాణాకు వెళ్లి..
ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రవీంద్ర.. మౌనికను కడతేర్చాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు. వీటిలో కొన్ని భాగాలను ఫ్రిడ్జ్‌లో ఉంచాడు. మిగతా భాగాలను మూటకట్టి తన ఇంట్లోనే దాచినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన అనంతరం రవీంద్ర స్వయంగా ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. డబ్బుల కోసం వేధించడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహ అవశేషాలను స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Nizamabad Murder Case | గొడ్డలితో మెడపై నరికి.. నిజామాబాద్‌లో యువకుడి దారుణ హత్య!
