Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sharwanand Biker Transformation | ‘బైకర్’ కోసం శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్.. రోజుకు 32 కి.మీ పరుగులు, రెండేళ్లు కఠిన సాధన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Sharwanand Biker Transformation | ‘బైకర్’ కోసం శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్.. రోజుకు 32 కి.మీ పరుగులు, రెండేళ్లు కఠిన సాధన

సినిమా

Sharwanand Biker Transformation | ‘బైకర్’ కోసం శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్.. రోజుకు 32 కి.మీ పరుగులు, రెండేళ్లు కఠిన సాధన

శర్వానంద్ తన ‘బైకర్’ సినిమా కోసం చేసిన అద్భుతమైన ఫిజికల్, మెంటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 10:09 ఉద.
Srinivas Kolluri
14 గంటలు ago
Share
Sharwanand Biker Transformation

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sharwanand Biker Transformation | ఈతరం హీరోలు పాత్ర కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటున్నారనే దానికి మరో ఉదాహరణగా నిలిచారు శర్వానంద్ (Sharwanand). ఒకప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన ఆయన, ఇప్పుడు పూర్తిగా సన్నగా మారి కొత్త లుక్‌లో కనిపించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ మార్పు అంతా ఆయన నటిస్తున్న బైకర్ సినిమా కోసమే.దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మోటో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ 18 ఏళ్ల బైక్ రేసర్‌గా కనిపించనున్నారు.

Contents
  • Sharwanand Biker Transformation | యోగా వ‌ల‌న మ‌రింత స్ట్రాంగ్…
    • Sharwanand Biker Transformation | నా కోసం నేను చేసుకున్న

ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా, డా. రాజశేఖర్ (Dr. Rajasekhar) కీలక పాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా కోసం చేసిన తన ప్రయాణాన్ని శర్వానంద్ ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. “నా జీవితంలో ఫిజికల్, మెంటల్‌గా చాలా కష్టమైన దశలో ఉన్నాను. అప్పుడు కొత్తగా ఎదగాలని అనిపించింది. అదే సమయంలో ‘బైకర్’ స్క్రిప్ట్ వచ్చింది. ఈ సినిమా కోసం నా వంతు 100 శాతం కృషి చేయాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపారు.

Sharwanand Biker Transformation | యోగా వ‌ల‌న మ‌రింత స్ట్రాంగ్…

తన ట్రాన్స్‌ఫర్మేషన్ (Transformation) గురించి వివరించుతూ, రెండేళ్లపాటు ప్రతి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేవడం ప్రారంభమైంది. స్ట్రెచ్చింగ్, యోగా, ప్రాణాయామం, కఠిన ట్రైనింగ్‌తో రోజంతా గడిచేది. ఒక దశలో రోజుకు ఉదయం, సాయంత్రం కలిపి 32 కి.మీ పరుగులు తీసేవాడిని. ఇది చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించినా ఆగలేదు అని చెప్పారు. అంతేకాదు, యోగా  (Yoga) తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని శర్వానంద్ వెల్లడించారు. యోగా వల్ల నేను మానసికంగా చాలా స్ట్రాంగ్ అయ్యాను. తక్కువ మాట్లాడటం, నెమ్మదిగా ఆలోచించడం, ముఖ్యమైన విషయాలపై ఫోకస్ పెట్టడం నేర్చుకున్నాను. శీర్షాసనం కూడా కొన్ని నిమిషాలు చేయగలిగే స్థాయికి చేరుకున్నాను అన్నారు.

Sharwanand Biker Transformation | నా కోసం నేను చేసుకున్న

తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో 6-7 కిలోలకుపైగా బరువు తగ్గినట్లు తెలిపారు. ఇది కేవలం సినిమా కోసం చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ కాదు.. నా కోసం నేను చేసుకున్న మార్పు. ఒక రోజు అద్దంలో చూసుకున్నప్పుడు ‘నేను రెడీ’ అని అనిపించింది. నేను సాధించగలిగితే ఎవరైనా సాధించగలరు అని శర్వానంద్ సందేశం ఇచ్చారు. ‘బైకర్’ సినిమాతో శర్వానంద్ కొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Dhurandhar 2 collections | ‘ధురంధర్: ది రివెంజ్’ సంచలనం.. ‘బాహుబలి 2’ రికార్డ్ బ్రేక్

Hansika Motwani Divorce | విడాకులు తీసుకున్న నటి హన్సిక
Vijay Rashmika Wedding | పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక
Dhurandhar Box Office | బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్: ది రివెంజ్.. 3 రోజుల్లోనే రూ.448 కోట్లు!
Gaddar Cinema Awards | గద్దర్​ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్​ రాంబాయి
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
TAGGED:actor transformationbiker moviecelebrity fitnessfitness journeymovie preparationSharwanandSharwanand Biker TransformationTelugu CinemaTollywood News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gadwal Fire Accident Gadwal Fire Accident | జోగులాంబ గద్వాలలో భారీ అగ్నిప్రమాదం.. పెయింటింగ్ షాపు దగ్ధం, రూ.35 లక్షల నష్టం
Next Article Telangana Rain Forecast Telangana Rain Forecast | పలు జిల్లాలకు వర్ష సూచన..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?