అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Rain Forecast | మండుతున్న ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officials) తెలిపారు.
సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈ సాయంత్రం నుండి రాత్రి వేళల్లో అక్కడక్కడ తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చు. ఇక హైదరాబాద్ (Hyderabad)లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పొడి వాతావరణం ఉంటుంది. రాత్రి అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
Telangana Rain Forecast | ఉక్కపోత నుంచి ఉపశమనం
రాష్ట్రంలో వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఇటీవల అకాల వర్షాలతో కాస్త చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కింది. దీంతో మధ్యాహ్నం పూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే సోమవారం, మంగళవారం పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించనుంది. సోమవారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది.
Telangana Rain Forecast | రైతుల్లో కలవరం
అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల కింద కురిసిన వడగళ్ల వానతో చాలా ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట చేతికొచ్చే సమయంలో వడ్లు నేలరాలయి. ప్రస్తుతం వరికోతలు ప్రారంభం అయ్యాయి. ఈ తరుణంలో వానలు పడితే ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయే అవకాశం ఉంది. అలాగేకోతకు వచ్చిన వరి పొలంలో వడ్లు నేలరాలుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Nalgonda Budget 2026 | నల్గొండ నగరానికి భారీ బూస్ట్.. రూ. 281.46 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి!
