అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PSL Ball Tampering | పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 (Pakistan Super League 2026) సీజన్ మరోసారి వివాదాలతో వార్తల్లో నిలిచింది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ ఘటన బయటపడటం సంచలనంగా మారింది. లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అంపైర్లు మ్యాచ్ మధ్యలోనే ఈ ట్యాపరింగ్ కలకలాన్ని గుర్తించారు.
మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ (Lahore Qalandars) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫిక్ (33), హసీబుల్లా ఖాన్ (28) రాణించారు. కరాచీ బౌలర్లలో మొయిన్ అలీ, ఆడమ్ జంపా, మీర్ హంజా తలో రెండు వికెట్లు తీశారు. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్, చివరి ఓవర్ల వరకు పోరాడింది. 19 ఓవర్లకు 115/5 స్కోరుతో నిలిచిన జట్టు, చివరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉంది.
PSL Ball Tampering | బాల్ ట్యాంపరింగ్ ఎలా బయటపడింది?
చివరి ఓవర్ వేయడానికి హరీస్ రవూఫ్ సిద్ధమవుతుండగా, కెప్టెన్ షాహీన్ అఫ్రిది సూచనలు ఇస్తున్నారు. ఈ సమయంలో సీనియర్ ఆటగాడు ఫఖర్ జమాన్ (Fakhar Zaman) బంతిని తీసుకుని తన గోళ్లతో దాని ఉపరితలాన్ని మార్చే ప్రయత్నం చేశాడు.దీనిని గమనించిన అంపైర్లు వెంటనే బంతిని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా బంతిని మార్చినట్లు నిర్ధారించిన అనంతరం, బంతిని మార్చడమే కాకుండా కరాచీ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ జోడించారు. ఈ పెనాల్టీతో కరాచీ విజయ లక్ష్యం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. చివరకు 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి కరాచీ కింగ్స్ విజయం సాధించింది.
PSL Ball Tampering | మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో విచారణ
ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) స్పందిస్తూ, మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో విచారణ జరుగుతోందని తెలిపింది. ఫఖర్ జమాన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించినట్లు వెల్లడించింది. రాబోయే 48 గంటల్లో పూర్తి విచారణ అనంతరం తుది నిర్ణయం వెలువడనుంది. ఆరోపణలు నిజమని తేలితే ఫఖర్ జమాన్‌పై మ్యాచ్ నిషేధం సహా కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే వివాదాలతో సతమతమవుతున్న పీఎస్ఎల్‌కు ఈ ఘటన మరో పెద్ద దెబ్బగా మారింది. లీగ్ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Virat Kohli innings | దుమ్మురేపిన ఆర్సీబీ .. కోహ్లీ సునామీ ఇన్నింగ్స్‌తో 202 టార్గెట్ సునాయాసంగా ఛేజ్
