అక్షరటుడే, వెబ్డెస్క్: April Bank Holidays | బ్యాంకు సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణ (Telangana)లోని బ్యాంకులకు ఏప్రిల్ నెలలో తొమ్మిది రోజులు సెలవులు వచ్చాయి. ఇందులో పండుగలతో పాటు వారాంతపు సెలవులు కూడా కలిసి ఉన్నాయి.
కాగా ఆయా రోజుల్లో బ్యాంకు శాఖలు మాత్రమే మూసి ఉంటాయి. ఇతర బ్యాంకింగ్ సేవ (Banking Services)లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఏటీఎంలు, యూపీఐ, ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ యథావిధిగా అందుబాటులో ఉంటాయి.
April Bank Holidays | దేశవ్యాప్తంగా సెలవుల వివరాలు..
ఏప్రిల్ 1: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా ‘అకౌంట్స్ యాన్యువల్ క్లోజింగ్’ (Annual Accounts Closing) ఉంటుంది. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 3: గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు.
ఏప్రిల్ 14: అంబేడ్కర్ జయంతి సందర్భంగా అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
April Bank Holidays | వివిధ రాష్ట్రాలలో లోకల్ సెలవులు..
పలు రాష్ట్రాలలో స్థానిక పండుగలు, ప్రత్యేక రోజుల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
ఏప్రిల్ 2: మౌండీ థర్స్ డే సందర్భంగా కేరళలో బ్యాంకులు బంద్.
ఏప్రిల్ 15 (బుధవారం): బెంగాలీ నూతన సంవత్సరం, బొహగ్ బిహు హిమాచల్ డే సందర్భంగా కోల్‌కతా, గువహటి, సిమ్లా వంటి ప్రాంతాల్లో సెలవు ఉంటుంది.
ఏప్రిల్ 20: అక్షయ తృతీయ, బసవ జయంతి సందర్భంగా కర్ణాటకలోని బ్యాంకులకు సెలవు.
April Bank Holidays | వారాంతపు సెలవులు..
వారాంతపు సెలవులు అన్ని రాష్ట్రాలలో వర్తిస్తాయి.
ఏప్రిల్ 5: ఆదివారం
ఏప్రిల్ 11: రెండో శనివారం
ఏప్రిల్ 12: ఆదివారం
ఏప్రిల్ 19: ఆదివారం
ఏప్రిల్ 25: నాలుగో శనివారం
ఏప్రిల్ 26: ఆదివారం
ఇది కూడా చదవండి..: Maoist Leader Surrender | లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత
