అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nitish Kumar Resignation | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ (Nitish Kumar) ఎమ్మెల్సీ పదవికి సోమవారం రాజీనామా చేశారు. త్వరలోనే సీఎం పదవికి సైతం రాజీనామా చేయనున్నారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సైతం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇద్దరు నాయకులు తమ ప్రతినిధుల ద్వారా రాజీనామా లేఖలను పంపారు. ఎమ్మెల్సీ సంజయ్ గాంధీ (MLC Sanjay Gandhi) , పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరితో కలిసి నితీష్ కుమార్ లేఖను శాసన మండలి ఛైర్మన్‌కు అందజేయగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరావోగి నబిన్ లేఖను శాసనసభ స్పీకర్‌కు అందజేశారు. కాగా నితీశ్‌కుమార్, నబిన్ మార్చి 16న రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Nitish Kumar Resignation | కొత్త సీఎం ఎవరు
బీహార్ (Bihar)లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి కొనసాగిన నితీశ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది. బీజేపీ 89 స్థానాల్లో, జేడీయూ 85 స్థానాల్లో గెలుపొందాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిని బీజేపీ తీసుకోనున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవిని జేడీయూకు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నితీశ్‌కుమార్ కుమారుడు సైతం ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను డిప్యూటీ సీఎం చేస్తారని వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి..: April Bank Holidays | ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు!
