అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Drug Bust | హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ దందా ఆగడం లేదు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తూ పలువురు భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ సైతం డ్రగ్స్ దందా చేస్తుండటం గమనార్హం.
హైదరాబాద్‌లోని మోకిలాలో పోలీసులు (Mokila Police) భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు దాడులు చేసి 40 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తి రైల్వే శాఖ (Department of Railways)లో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సదరు రైల్వే ఉద్యోగి కారులో డ్రగ్స్ తీసుకు వస్తున్నట్లు గుర్తించారు.
Hyderabad Drug Bust | అనుమానం రాకుండా..
రైల్వే శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఈ డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. బెంగళూరు, గోవా వంటి ప్రాంతాల నుంచి ఖరీదైన కొకైన్‌ను నగరానికి తీసుకు వస్తున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా డ్రగ్స్ దందా కోసం తన సొంత కారునే వినియోగిస్తున్నాడు. తాజాగా పోలీసులు దాడులు చేసి రైల్వే ఉద్యోగిపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో ఒకరు గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా, మరో ప్రముఖ వ్యాపారవేత్త కావడం గమనార్హం.స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ భారీగా ఉంటుందని పోలీసులు తెలిపారు నిందితులు డ్రగ్స్ రవాణా కోసం వినియోగిస్తున్న రెండు కార్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. వీరి వద్ద మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్న వారి వివరాలను సైతం సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Pista House biryani issue | పిస్తాహౌస్ బిర్యానీలో ఈగలు, బొద్దింకలు
