Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KTR Warning Police | ఎవరిని వదిలిపెట్టం.. పోలీసులకు కేటీఆర్​ వార్నింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - KTR Warning Police | ఎవరిని వదిలిపెట్టం.. పోలీసులకు కేటీఆర్​ వార్నింగ్​

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

KTR Warning Police | ఎవరిని వదిలిపెట్టం.. పోలీసులకు కేటీఆర్​ వార్నింగ్​

పోలీసులకు కేటీఆర్​ వార్నింగ్​ ఇచ్చారు. మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందని అక్రమాలకు సహకరించే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 30, 2026 1:19 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 గంటలు ago
Share
KTR Warning Police

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Warning Police | పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు అక్రమాలకు సహకరించే పోలీసు అధికారులకు బీఆర్​ఎస్​ (BRS) వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ వార్నింగ్​ ఇచ్చారు. పొంగులేటి అనుచరులు ప్రహరీ కూలుస్తుంటే, పోలీసులు పక్కన కూర్చొని టిఫిన్ తింటున్నారట అన్నారు. రెండున్నరేళ్లలో మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందని, అక్రమాలకు సహకరించే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.

Contents
  • KTR Warning Police | మంత్రి బెదిరించారు
    • KTR Warning Police | బదిలీ చేశారు
      • KTR Warning Police | కఠిన చర్యలు తీసుకోవాలి

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సోమవారం రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో పర్యటించారు. కేటీఆర్​ (KTR) మాట్లాడుతూ.. 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉందన్నారు. గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయని చెప్పారు. సతీష్ షా కుటుంబానికి చెందిన భూమి సుమారు రూ.1400 కోట్ల విలువ కలిగి ఉండగా, దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కన్నుపడిందని ఆరోపించారు.

KTR Warning Police | మంత్రి బెదిరించారు

మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షా రెడ్డి కలిసి సతీష్ షా ఇంటికి వెళ్లి, భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారని కేటీఆర్​ ఆరోపించారు. ఆయన కుటుంబం ఒప్పుకోకపోవడంతో మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారన్నారు. రెవెన్యూ అధికారులతో తో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. అంతేగాకుండా అక్కడ నిర్మించిన గోశాలను సైతం కూల్చివేశారన్నారు.

KTR Warning Police

KTR Warning Police | బదిలీ చేశారు

ఈ ఘటనపై బాధితులను పోలీసులకు ఫిర్యాదు చేశారని కేటీఆర్​ తెలిపారు. దీంతో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను ప్రభుత్వం బదిలీ చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోందన్నారు. బాధితులకు బీఆర్​ఎస్​ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

KTR Warning Police | కఠిన చర్యలు తీసుకోవాలి

అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్​ డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) పై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గవర్నర్‌ను కలుస్తున్నామని, త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని కేటీఆర్​ తెలిపారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Drug Bust | డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన రైల్వే ఉద్యోగి

Telangana Law and Order | శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి : సీఎం రేవంత్​రెడ్డి
Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
Iran Missile Attacks | ఇరాన్ దాడులతో దద్దరిల్లిన గల్ఫ్.. ఖతార్‌లోని రస్‌లఫాన్ రిఫైనరీలపై బాంబుల వర్షం!
Maoists Surrender Telangana | లొంగిపోనున్న మావోయిస్ట్​ అగ్రనేత గణపతి!
Rajagopal Reddy criticism | ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి విమర్శలు
TAGGED:BRS PartyFIRHyderabad newsKTRKTR Warning Policeland disputeMLA Kaushik Reddypolice warningpolitical news indiaPonguleti Srinivas ReddyTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Drug Bust Hyderabad Drug Bust | డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన రైల్వే ఉద్యోగి
Next Article Hate Speech Bill Hate Speech Bill | సోషల్​ మీడియాలో వేధింపులపై చర్యలు​.. కీలక బిల్లు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?