అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ambali Distribution Center | కలెక్టరేట్ (Collectorate)కు వచ్చే ప్రజలు కోసం ప్రతి ఏడాది టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో అంబలి కేంద్రం ఏర్పాటు అభినందనీయమని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. ఈ మేరకు సోమవారం కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
Ambali Distribution Center | ప్రజలు, ఉద్యోగులకు ఉపశమనం..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని సాధారణ ప్రజలు, ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు వీలుగా తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ సంఘాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్ ప్రతినిధులు కృషిచేస్తూ.. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అని ఆమె పేర్కొన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయానికి వచ్చే వారికి ప్రస్తుత వేసవిలో అంబలి కేంద్రం (Ambali Center) ఉపశమనాన్ని అందిస్తుందన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్, కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకుడు గైని గంగారాం, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Murder Case | గొడ్డలితో మెడపై నరికి.. నిజామాబాద్‌లో యువకుడి దారుణ హత్య!
