అక్షరటుడే, ఆర్మూర్ : Labour Codes Protest | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రూరల్ (Nizamabad Rural), కామారెడ్డి (Kamareddy) సంయుక్త జిల్లా అధ్యక్షుడు ముత్తన్న డిమాండ్ చేశారు. పట్టణంలోని అంగడిబజార్ చౌరస్తాలో లేబర్ కోడ్ ప్రతులను దహనం చేశారు.
Labour Codes Protest | కష్టపడి సాధించుకున్న చట్టాలను మార్పు చేసి..
ఈ సందర్భంగా ముత్తన్న మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం మార్పు చేసి కొత్తగా నాలుగు లేబర్ కోడ్ (Labor Code)లను తీసుకొచ్చిందన్నారు. ఈ కొత్త కోడ్ల కారణంగా కార్మికులకు ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ప్రైవేటు సంస్థల్లో అదనంగా పనిగంటలు పెంచుతూ తీసుకొచ్చిన ఈ చట్టాల కారణంగా కార్మికులు కష్టాలపాలవుతారన్నారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ తీసుకొచ్చిన ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి అర్వింద్, ఆర్మూర్ మండల నాయకులు ఎండీ.నజీర్, ఎన్.నిఖిల్, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Ambali Distribution Center | కలెక్టరేట్లో అంబలి కేంద్రం ఏర్పాటు అభినందనీయం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
