అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Udan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో ఏది కొనాలన్నా భారీగా రేట్లు ఉంటాయి. ఈ క్రమంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం (Central Government) ఉడాన్ యాత్రి పేరిట కేఫ్‌లను ప్రారంభిస్తోంది. ఇందులో రూ.10కే టీ, రూ.20కి కాఫీ అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 57 విమానాశ్రయాల్లో వీటిని ఏర్పాటు చేయగా తాజాగా లక్నోలో ప్రారంభించారు
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ఆదివారం చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CCSIA)లో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ను వర్చువల్‌గా ప్రారంభించారు. టెర్మినల్ 3లోని చెక్-ఇన్ హాల్‌లో ఉన్న ఈ కేఫ్ రూ.10 నుంచి ప్రారంభమయ్యే స్నాక్స్, పానీయాలను అందించనుంది.
Udan Yatri Cafe | సామాన్యులకు అందుబాటులో..
కేంద్ర మంత్రి మాట్లాడుత… ప్రయాణికుల రోజువారీ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా ఈ కేఫ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యమన్నారు. నీరు, శీతల పానీయాలు, స్నాక్స్, స్వీట్లు వంటి అవసరమైన ఆహార, పానీయ పదార్థాలు సరసమైన ధరలకు ఈ కేఫ్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కేఫ్‌ను ఎంపీ రాఘవ్చద్ద సందర్శించారు. కేఫ్‌లను ఏర్పాటుపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
ఇది కూడా చదవండి..: Nitish Kumar Resignation | ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
