Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: UDAN Scheme Expansion | వికసిత్ భారత్ కు ‘ఉడాన్’ ఊతం!.. మరో 100 విమానాశ్రయాల నిర్మాణం వైపు అడుగులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - UDAN Scheme Expansion | వికసిత్ భారత్ కు ‘ఉడాన్’ ఊతం!.. మరో 100 విమానాశ్రయాల నిర్మాణం వైపు అడుగులు

జాతీయం

UDAN Scheme Expansion | వికసిత్ భారత్ కు ‘ఉడాన్’ ఊతం!.. మరో 100 విమానాశ్రయాల నిర్మాణం వైపు అడుగులు

వికసిత్ భారత్ వైపు అడుగులు పడుతున్నాయి. వచ్చే దశాబ్ద కాలంలో దేశంలో అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను పెంచేందు కోసం కొత్తగా 100 విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్‌ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 3:21 సా.
Srinivas Kolluri
13 గంటలు ago
Share
UDAN Scheme Expansion

అక్షరటుడే, వెబ్​డెస్క్ : UDAN Scheme Expansion | దేశీయ విమానయాన రంగాన్ని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రూ. 28,840 కోట్ల బడ్జెట్‌తో ఉడాన్ 2.0 ను ఆమోదించింది.

Contents
  • UDAN Scheme Expansion | ఎయిర్ కనెక్టివిటీ పెంచాలన్న లక్ష్యంతో..
    • UDAN Scheme Expansion | 2016లో అమలులోకి..
      • UDAN Scheme Expansion | రెండో విడతలో..
        • UDAN Scheme Expansion | మేడ్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత..

ఈ పథకం అమలు కోసం పదేళ్ల (2026-27 నుంచి 2035-36 వరకు) కాలానికి రూ. 28,840 కోట్లు నిధులను కేటాయించారు. ఈ నిధులతో కొత్తగా 100 విమానాశ్రయాలను, 200 ఆధునిక హెలిప్యాడ్‌లను నిర్మించనున్నారు. ఇటీవల ప్రధాని మోదీ (Prime Minister Modi) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

UDAN Scheme Expansion | ఎయిర్ కనెక్టివిటీ పెంచాలన్న లక్ష్యంతో..

చిన్న నగరాల నుంచి నేరుగా విమానాలు నడపడం ద్వారా పర్యాటకం, వ్యాపార రంగాలు అభివృద్ధి చెందడమే కాకుండా ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని, ఎత్తైన పర్వత ప్రాంతాలలో అత్యవసర సేవలు అందించడం సులవవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం దేశంలోని రీజనల్ ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఉడాన్) పథకాన్ని తీసుకువచ్చింది. టైర్-2, టైర్-3 నగరాలు, ఎత్తైన ప్రాంతాలు, ద్వీపాలు, ఆస్పిరేషనల్ జిల్లాల్లో విమానయాన సౌకర్యాలను (Aviation facilities) మెరుగుపరచడం. దీని ద్వారా సాధారణ ప్రజలు సరసమైన ధరల్లో విమాన ప్రయాణాలు చేయగలగడానికి అవకాశం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇది ప్రాంతీయ అభివృద్ధి, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలను పెంచుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

UDAN Scheme Expansion | 2016లో అమలులోకి..

కేంద్ర ప్రభుత్వం 2016లో ఉడాన్ పథకం ప్రారంభించింది. అప్పటి నుంచి 95 విమానాశ్రయాలు/హెలిపోర్టులు కనెక్ట్ అయ్యాయి. 3.41 లక్షలకు పైగా ఫ్లైట్లు నడిచాయి, 162 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. దీనికి ఇటీవల మార్పులు చేసి ఉడాన్ 2.0 ను తీసుకువచ్చింది.

UDAN Scheme Expansion | రెండో విడతలో..

ఉడాన్ 2.0లో భాగంగా ప్రస్తుతం ఉన్న అన్‌సర్వ్‌డ్ ఎయిర్‌స్ట్రిప్స్‌ (Unserved Airstrips)ను అప్‌గ్రేడ్ చేసి విమానాశ్రయాలుగా మారుస్తారు. దీనికి సుమారు రూ. 12,159 కోట్లు కేటాయించారు. సగటున ఒక్క విమానాశ్రయానికి రూ. 100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. వీటిని చాలెంజ్ మోడ్‌లో అభివృద్ధి చేస్తారు. అలాగే పర్వతాలు, దూరప్రాంతాలు, ద్వీపాలు వంటి కష్టమైన ప్రాంతాల్లో హెలికాప్టర్ ప్రయాణాల కోసం 200 ఆధునిక హెలిప్యాడ్లు నిర్మించనున్నారు. ఒక్కొక్క నిర్మాణానికి సుమారు రూ. 15 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. దీనికోసం రూ. 3,661 కోట్లు కేటాయించారు. ఇవి అత్యవసర సేవలు, ఆరోగ్య సంరక్షణ మరియు లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ఉపయోగపడనున్నాయి.సామాన్యులకు తక్కువ ధరకే విమాన ప్రయాణ సేవలు అందించేందుకు ఎయిర్ లైన్స్ సంస్థలకు రూ. 10,043 కోట్ల వయేబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) చేయాలనీ నిర్ణయించారు. దీని ద్వారా రిమోట్ రూట్లలోనూ విమానాలు నడపడం సులభం అవుతుందని భావిస్తున్నారు.

UDAN Scheme Expansion | మేడ్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత..

మేడ్ ఇన్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా స్థానికంగా తయారైన చిన్న విమానాలు, హెలికాప్టర్లను (హాల్ ధ్రువ్, డార్నియర్ వంటివి) కొనుగోలు చేసి ఉపయోగించాలని నిర్ణయించారు. ఉడాన్ 2.0 పథకం ద్వారా సుమారు 441 ఎయిర్‌డ్రోమ్‌లకు ఆపరేషనల్ మద్దతు ఇస్తారు.

ఇది కూడా చదవండి..: Udan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో తక్కువ ధరకే స్నాక్స్

Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
CA Results 2026 | సీఏ ఫలితాలు విడుదల
LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!
Fuel Shortage India | ఇంధన యుద్ధం.. దేశంలో పెట్రోల్​–డీజిల్​ కొరత.. బంకుల్లో వాహనదారుల బారులు!
TAGGED:air travel IndiaAviation facilitiesaviation sectorCentral GovernmentEconomic GrowthInfrastructure DevelopmentModi Governmentnew airports IndiaPrime Minister Modiregional connectivity IndiaUnserved Airstrips
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Udan Yatri Cafe Udan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో తక్కువ ధరకే స్నాక్స్
Next Article Gram Ward Sabha Gram Ward Sabha | గ్రామ, వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?