అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి వేగంగా నిధులు విడుదల చేయిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయా గ్రామాల సర్పంచ్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో (MLA Camp Office) ఎమ్మెల్యే చిత్రపటానికి మండలంలోని సర్పంచులు పాలాభిషేకం నిర్వహించారు.
Yellareddy MLA | మూడు నెలల వ్యవధిలోనే..
కేవలం మూడు నెలల వ్యవధిలోనే మండలంలోని 27 మంది సర్పంచ్‌లకు ఒక్కొక్కరికి వారివారి గ్రామాల్లో రూ.20 లక్షల విలువైన రోడ్ల పనులను మంజూరు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. గత 30ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామీణ రహదారి సమస్యలను పరిష్కరించే దిశగా తీసుకున్న ఈ నిర్ణయాలు గ్రామాల అభివృద్ధికి దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండలంలోని (Yellareddy Mandal) కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు (Congress Party Leaders), కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Gram Ward Sabha | గ్రామ,వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
