అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: DCC Executive Meeting | డీసీసీ కార్పొరేషన్ కార్యవర్గ సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలని కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో (Congress Party Office) ఇటీవల నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.
DCC Executive Meeting | కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలి..
ఈ సమావేశంలో భాగంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఉపాధ్యక్షులను బ్లాక్ ఇన్ఛార్జీలుగా, ప్రధాన కార్యదర్శులను డివిజన్ ఇన్ఛార్జీలుగా ఇంఛార్జీలుగా, కార్యదర్శులను కో–ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పజెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి నుంచి కమిటీలోని సభ్యులు వారికి ఇచ్చిన బాధ్యతలను పక్కాగా నిర్వహించాలని సూచించారు. సభ్యులు డివిజన్ అధ్యక్షులను, డివిజన్ కమిటీలను, బూత్ ఏజెంట్లను, బూత్ కమిటీలను, సోషల్ మీడియా కో–ఆర్డినేటర్లను నియమించాలని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి డివిజన్లో జరిగే ఏ కార్యక్రమమైనా ఇన్ఛార్జీల పర్యవేక్షణలో జరుగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ కార్యవర్గ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Yellareddy MLA | అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
