Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Food Adulteration Control | ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ: సీఎం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Food Adulteration Control | ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ: సీఎం

తెలంగాణతాజా వార్తలు

Food Adulteration Control | ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ: సీఎం

రాష్ట్రంలో ఆహార కల్తీని నియంత్రించడానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 5:19 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Food Adulteration Control

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Food Adulteration Control | రాష్ట్రంలో ఆహార కల్తీని నియంత్రించడానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఈగల్, హైడ్రా తరహాలోనే ఆహార కల్తీని నియంత్రణ కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం దేశంలో అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపడతామని చెప్పారు.

Contents
  • Food Adulteration Control | ప్రజాప్రతినిధులకు సన్నబియ్యంతో భోజనం
    • Food Adulteration Control | పేదలకు సన్న బియ్యం పంపిణీ
      • Food Adulteration Control | క్వింటాలుకు రూ.500 బోనస్

Food Adulteration Control | ప్రజాప్రతినిధులకు సన్నబియ్యంతో భోజనం

రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తయింది. 3.39 కోట్ల మందికి పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు శాసనసభ సెంట్రల్ హాల్​లో సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్​ రెడ్డితో పాటు మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar), ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని భోజనం చేశారు.

Food Adulteration Control | పేదలకు సన్న బియ్యం పంపిణీ

ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు. రేషన్ షాపుల (Ration Shops) ద్వారా దొడ్డుబియ్యం అందించినా తినేవారు లేరన్నారు. దీంతో ఈ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందన్నారు. పైగా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడడం లేదని వివరించారు. అందుకే పేదలు తినగలిగే సన్నబియ్యం అందించాలని ఈ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు.

Food Adulteration Control | క్వింటాలుకు రూ.500 బోనస్

పేదలకు బియ్యం పంపిణీ చేసేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహించామని ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డు జారీ చేశామని పేర్కొన్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వాణిజ్య, ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి..: KTR Warning Police | ఎవరిని వదిలిపెట్టం.. పోలీసులకు కేటీఆర్​ వార్నింగ్​

 

Summer Hailstorms | మండే ఎండల్లో మంచు ముక్కలు.. వేసవిలోనే వడగళ్ల వర్షం కురవడానికి కారణమేంటంటే!
Visakhapatnam Murder Case | విశాఖలో దారుణం.. ప్రియురాలిని చంపి.. ముక్కలుగా చేసి.. ఫ్రిడ్జ్​లో దాచి!
March 09 Horoscope | మార్కెటింగ్ రంగంలో ఉన్నత పదవి.. ఉద్యోగ మార్పుతో ఈ రాశుల వారికి అద్భుత యోగం!
Good Luck Signs | అదృష్టం వరించే ముందు వచ్చే సంకేతాలివే.. ఇంట్లో ఇవి కనిపిస్తే ఇక తిరుగులేనట్టే!
March 12 Gold Prices | మళ్లీ ఎగబాకిన బంగారం ధర.. కిలో వెండి రూ.3 లక్షలకు చేరువలో!
TAGGED:Bhatti VikramarkaCM Revanth ReddyFood Adulteration ControlRation ShopsSpeaker Gaddam Prasad Kumar
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article DCC Executive Meeting DCC Executive Meeting | డీసీసీ కార్పొరేషన్​ కార్యవర్గ సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలి
Next Article Complaint Boxes Controversy | Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు చట్టవిరుద్ధం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?