అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Prajavani Complaints Program | ప్రజావాణిలో నిర్భయంగా (Prajavani program) ఫిర్యాదు చేయవచ్చని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సీపీ కార్యాలయంలో (Nizamabad police) నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Prajavani Complaints Program | 17 ఫిర్యాదుల స్వీకరణ..
ఈ సందర్భంగా సీపీ ప్రజల నుంచి 17 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి (police grievance system) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని వివరించి పరిష్కారానికి ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం (Telangana police news) లేకుండా, ఎలాంటి పైరవీలు (law and order) లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవచ్చన్నారు. వారి సమస్యలు చట్టప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని సీపీ తెలిపారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Gram Ward Sabha | గ్రామ, వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
