Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Gosala Project | రూ.157 కోట్లతో గోశాల నిర్మించనున్న ప్రభుత్వం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Hyderabad Gosala Project | రూ.157 కోట్లతో గోశాల నిర్మించనున్న ప్రభుత్వం

తెలంగాణ

Hyderabad Gosala Project | రూ.157 కోట్లతో గోశాల నిర్మించనున్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్​ శివారులో ఆధునిక వసతులతో ప్రపంచ స్థాయి గోశాల నిర్మించనుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 6:21 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
Hyderabad Gosala Project

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Gosala Project | రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్​ శివారులో ఆధునిక వసతులతో ప్రపంచ స్థాయి గోశాల నిర్మించనుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad)​ మండలం యెంకపల్లిలో రూ.157 కోట్లతో దీనిని నిర్మించనున్నారు.

Contents
  • Hyderabad Gosala Project | హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలో..
    • Hyderabad Gosala Project | 54 ఎకరాల్లో మేత..

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల మంచిరేవుల గ్రామంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఓంకారేశ్వర ఆలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదే రోజు గోశాల నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దీనిని నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. పశువుల ఆరోగ్యం, పర్యావరణ స్థిరత్వం, ప్రజల్లో గోసేవపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గోశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

Hyderabad Gosala Project | హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలో..

గోశాల నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం హెచ్​ఎండీఏ (HMDA)కు అప్పగించింది. యెంకపల్లిలోని సర్వే నంబర్​ 180లో ఉన్న సుమారు 99 ఎకరాల 14 గుంటల భూమిని దీని కోసం కేటాయించింది. దీనిలో సుమారు వెయ్యి ఆవులను సంరక్షించేలా ఆధునిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. గోశాలలో షెడ్లు, క్వారంటైన్ సౌకర్యాలు, మిల్కింగ్ పార్లర్, అత్యవసర చికిత్స విభాగం, పాల ప్రాసెసింగ్ యూనిట్ వంటి వసతులు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇందులో అవుట్ పేషెంట్ విభాగం, శస్త్రచికిత్స గది, ఐసోలేషన్ వార్డులు, ఫార్మసీ, ఎక్స్-రే గది, పాథాలజీ ల్యాబ్​లతో కూడిన పశువైద్య ఆస్పత్రిని కూడా నిర్మించనున్నారు.

Hyderabad Gosala Project | 54 ఎకరాల్లో మేత..

గోశాలలోని పశువుల ఎరువుతో బయోగ్యాస్, సీఎన్‌‌జీ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే సౌర విద్యుత్​ ప్లాంట్​ సైతం నెలకొల్పుతారు. పశువుల మేత కోసం 54 ఎకరాల్లో గడ్డి సాగు చేయనున్నారు.

దీనిని కూడా చదవండి : Hate Speech Bill | సోషల్​ మీడియాలో వేధింపులపై చర్యలు​.. కీలక బిల్లు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం

RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
Record Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్​ల నియామకం
Fake ice cream | కల్తీ ఐస్​క్రీముల తయారీ.. నిందితుడి అరెస్ట్
Telangana Rajya Sabha Candidates | తెలంగాణ కాంగ్రెస్​ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే!
TAGGED:cattle care facilitiescow shelter IndiaHMDA developmentHyderabad gosalaRangareddy project
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Prajavani Complaints Program | Prajavani Complaints Program | పోలీస్​ ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు : సీపీ సాయిచైతన్య
Next Article Dalit Temple Entry Protest | Dalit Temple Entry Protest | ఆలయ ప్రవేశం చేయిస్తామని అధికారులు రాలేదు.. నర్సన్నపల్లి గ్రామ దళితుల ఆగ్రహం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?