Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Dalit Temple Entry Protest | ఆలయ ప్రవేశం చేయిస్తామని అధికారులు రాలేదు.. నర్సన్నపల్లి గ్రామ దళితుల ఆగ్రహం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Dalit Temple Entry Protest | ఆలయ ప్రవేశం చేయిస్తామని అధికారులు రాలేదు.. నర్సన్నపల్లి గ్రామ దళితుల ఆగ్రహం

నిజామాబాద్

Dalit Temple Entry Protest | ఆలయ ప్రవేశం చేయిస్తామని అధికారులు రాలేదు.. నర్సన్నపల్లి గ్రామ దళితుల ఆగ్రహం

తమకు గ్రామంలోని ఆలయాల్లో ప్రవేశం చేయిస్తామని హామీఇచ్చి ఉన్నతాధికారులు రాకపోవడంతో పాటు డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐలను పంపడం పట్ల దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకుకలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 30, 2026 7:14 సా.
Shashi kiran Mottala
9 గంటలు ago
Share
Dalit Temple Entry Protest |
Dalit Temple Entry Protest | ఆలయ ప్రవేశం చేయిస్తామని అధికారులు రాలేదు.. నర్సన్నపల్లి గ్రామ దళితుల ఆగ్రహం

అక్షరటుడే, కామారెడ్డి: Dalit Temple Entry Protest | తమను గ్రామంలోని ఆలయాల్లో ప్రవేశం చేయిస్తామని (Dalit protest) హామీఇచ్చి ఉన్నతాధికారులు రాకపోవడంతో పాటు (Kamareddy) డిప్యూటీ తహశీల్దార్, ఆర్ఐలను పంపడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకుకలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. పోలీసులు చివరకు ఆర్డీవోతో ఫోన్ మాట్లాడించడంతో దళితులు శాంతించారు. ఈ ఘటన కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

Contents
  • Dalit Temple Entry Protest | గతంలో ముగ్గురిపై కేసులు..
    • Dalit Temple Entry Protest | అధికారులు రాకపోవడంతో..

Dalit Temple Entry Protest | గతంలో ముగ్గురిపై కేసులు..

గ్రామంలో దళితుల పట్ల ఇతర కులస్థులు, సర్పంచ్ చిన్నచూపు చూస్తున్నారని, తమను గ్రామం నుంచి బహిష్కరిస్తారని బెదిరిస్తున్నారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ముగ్గురిపై కేసు నమోదు కాగా సోమవారం గ్రామానికి కలెక్టర్, ఎస్పీ వచ్చి గ్రామంలోని ఆలయాల్లోకి దళితులను ప్రవేశం చేయిస్తారని అధికారులు సమాచారం ఇచ్చారు. దాంతో ఉదయమే దళితులు గ్రామంలో ఏర్పాట్లు చేసుకున్నారు. టెంట్లు, కుర్చీలు వేసి ఆలయాల్లో కొట్టడానికి కొబ్బరికాయలు, అందరికీ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం 11:30 గంటలకు వస్తారని చెప్పినా ప్రజావాణి, వీసీ వల్ల ఆలస్యం అవుతుందని, మధ్యాహ్నం 3 గంటలకు వస్తారని తిరిగి సమాచారమిచ్చారు. దాంతో సాయంత్రం వరకు దళితులు వేచి చూశారు.

Dalit Temple Entry Protest | అధికారులు రాకపోవడంతో..

మధ్యాహ్నం దాటిపోయినా ఉన్నతాధికారులు రాకపోవడం, డిప్యూటీ తహశీల్దార్, ఆర్ఐలను గ్రామానికి పంపడంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు గ్రామంలో అగ్రవర్ణాల (rural issues India) పెద్దలు చిన్నచూపు చూస్తుంటే ఉన్నతాధికారులు కూడా తమపట్ల చిన్నచూపు చూస్తున్నారని భావిస్తూ ఉన్నతాధికారులు రాకపోతే తామే అధికారుల వద్దకు వెళ్తామని (social justice India) అంబేడ్కర్​ ఫొటో పట్టుకుని ర్యాలీగా కలెక్టరేట్​కు (Telangana news) పాదయాత్రగా బయలుదేరారు. గ్రామ స్టేజీ దాటి కాస్త దూరం వరకు వెళ్లగానే కామారెడ్డి రూరల్ సీఐ రామన్, ఎస్సై రంజిత్ కుమార్ చేరుకుని దళితులతో మాట్లాడారు. తహశీల్దార్ చేరుకుని ఆర్డీవోతో ఫోన్​లో మాట్లాడించారు. మంగళవారం కలెక్టర్​తో పాటు తాను కూడా గ్రామానికి వస్తామని చెప్పడంతో దళితులు వెనుదిరిగారు.

 ఇది కూడా చదవండి: Complaint Boxes Controversy | ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు చట్టవిరుద్ధం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Citizen Friendly Policing | సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్​కు ప్రాధాన్యతనివ్వాలి: ఎస్పీ రాజేష్ చంద్ర
Mobile Theft Arrest | మొబైళ్లు చోరీ చేసిన దొంగ అరెస్ట్
Nizamabad BJP Protest | ఇందూరుపై సీఎం రేవంత్​రెడ్డి సవతితల్లి ప్రేమ: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Gold Price Drop | సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గిన పసిడి
OBC Women Quota | మహిళా రిజర్వేషన్​లలో ఓబీసీ కోటా అమలు చేయాలి : కవిత
TAGGED:Dalit protestrural issues Indiasocial justice IndiaTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Gosala Project Hyderabad Gosala Project | రూ.157 కోట్లతో గోశాల నిర్మించనున్న ప్రభుత్వం
Next Article SI caught by ACB SI caught by ACB | ఏసీబీకి చిక్కిన ఎస్సై
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?