అక్షరటుడే, వెబ్డెస్క్ : Naxalism Elimination India | దేశంలో నక్సలిజం నిర్మూలనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం బస్తర్‌లో దాదాపుగా మావోయిస్టులు లేరన్నారు. ఆదివాసీలకు అన్ని ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని వెల్లడించారు.
దేశంలో మార్చి 31లోపు మావోయిస్టులను లేకుండా చేస్తామని గతంలో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. రేపటితో ఆ గడువు ముగియనుంది. ఈ క్రమంలో సోమవారం పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడారు. మావోయిస్టులు వెంటనే ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని సూచించారు. లేదంటే భద్రతా దళాల కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బస్తర్ (Bastar) ప్రాంతం ఇప్పటికే 90 శాతం నక్సల్స్ రహితంగా మారిందని స్పష్టం చేశారు.
Naxalism Elimination India | ఇది మోదీ ప్రభుత్వం
బస్తర్‌లో అభివృద్ధి జరుగుతోందని, అభివృద్ధి లేదని ఆయుధాలు పట్టడం సరికాదని అమిత్ షా అన్నారు. ఇది మోదీ (Modi) ప్రభుత్వమని, తమ ప్రభుత్వంలో ఆయుధాలు పట్టుకుంటామంటే కుదరదని హెచ్చరించారు. వామపక్ష తీవ్రవాదానికి, అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు సంక్షేమ ప్రయోజనాలు కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన ఆరోపించారు.
Naxalism Elimination India | భద్రతా బలగాల విజయం
దేశం నక్సల్ రహిత దేశంగా మారే అంచున ఉందని హోం మంత్రి అన్నారు. ఇది భద్రతా బలగాల విజయం అని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు బీర్సా ముండా, తిలకా మాంఝీ, రాణి దుర్గావతి వంటి మహనీయులను ఆరాధించిన గిరిజన వర్గాలు పాలనాపరమైన లోపాల కారణంగా మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యారని షా అన్నారు. మళ్లీ ఆయుధాలు చేపట్టేవారిపై కఠిన వైఖరిని అవలంబిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
దీనిని కూడా చదవండి : April Bank Holidays | ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు!
