Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bipolar Disorder Treatment | బైపోలార్​ వ్యాధికి అనేక చికిత్స మార్గాలు.. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Bipolar Disorder Treatment | బైపోలార్​ వ్యాధికి అనేక చికిత్స మార్గాలు.. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్

తెలంగాణనిజామాబాద్

Bipolar Disorder Treatment | బైపోలార్​ వ్యాధికి అనేక చికిత్స మార్గాలు.. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్

బైపోలార్​ వ్యాధికి అనేక చికిత్స మార్గాలున్నాయని న్యూరో సైకియాట్రిస్ట్​ డాక్టర్​ విశాల్ తెలిపారు. సీబీటీ, సైకోథెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్, గ్రూప్ థెరపీ లాంటి పద్ధతులతో వ్యాధిని నయం చేయవచ్చన్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 30, 2026 8:02 సా.
Shashi kiran Mottala
10 గంటలు ago
Share
Bipolar Disorder Treatment |
Bipolar Disorder Treatment | బైపోలార్​ వ్యాధికి అనేక చికిత్స మార్గాలున్నాయి..: ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ డాక్టర్​ విశాల్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bipolar Disorder Treatment | బైపోలార్​ వ్యాధికి (bipolar disorder) అనేక చికిత్స మార్గాలున్నాయని.. సీబీటీ (CBT therapy), సైకోథెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్, గ్రూప్ థెరపీ లాంటి పద్ధతులతో (mental health awareness) వ్యాధిని నయం చేయవచ్చని న్యూరో సైకియాట్రిస్ట్​ డాక్టర్​ విశాల్ (Vishal Akula) అన్నారు. ఐఎంఏ నిజామాబాద్ (IMA Nizamabad), తెలంగాణ మెంటల్ హెల్త్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ బైపోలార్ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ ఆసుపత్రిలో బైపోలార్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Contents
  • Bipolar Disorder Treatment | బైపోలార్​ అంటే రెండు ధృవాలు..
    • Bipolar Disorder Treatment | మితిమీరిన ఆత్మవిశ్వాసం..
      • Bipolar Disorder Treatment |హైపోమానియా దశలో..
        • చికిత్స మార్గాలున్నాయ్​..

Bipolar Disorder Treatment | బైపోలార్​ అంటే రెండు ధృవాలు..

ఐఎంఏ నిజామాబాద్​ అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్ ఆకుల మాట్లాడుతూ బైపోలార్ డిసార్డర్ అనేది ఒక తీవ్రమైన (Nizamabad health news) మానసిక వ్యాధి అని తెలిపారు. ‘పోలార్’ అంటే ధృవం, ‘బైపోలార్’ అంటే రెండు ధృవాలు అనే అర్థం వస్తుందన్నారు. ఒకే వ్యక్తిలో వివిధ సమయాల్లో(psychiatric treatment) రెండు రకాల మానసిక స్థితులు ఉండడం బైపోలార్ డిసార్డర్ లక్షణమని వివరించారు. ఈ వ్యాధిలో హైపోమానియా, మానియా, డిప్రెషన్ దశలు ఉంటాయని.. ఒక వ్యక్తి కొంతకాలం హైపోమానియా లేదా మానియా దశలో ఉండి, తర్వాత డిప్రెషన్ దశకు లోనవుతాడన్నారు. ఈ దశలు కొందరిలో రోజులు, కొందరిలో నెలలు, ఇంకొందరిలో ఏళ్ల పాటు కొనసాగవచ్చని తెలిపారు.

Bipolar Disorder Treatment | మితిమీరిన ఆత్మవిశ్వాసం..

రోగి మానియా దశలో ఉన్నప్పుడు మితిమీరిన ఆత్మవిశ్వాసం, అతి హుషారుగా ఉండటం,(depression and mania) గొప్పలు చెప్పడం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం చేస్తుంటాడని డాక్టర్​ విశాల్​ అన్నారు. అతిగా మాట్లాడటం, పాటలు పాడడం, నృత్యం చేయడం, అధిక అలంకరణ చేసుకోవడం, తెలియని వారిని పలకరించడం, అతి కోపం, చిరాకు వంటి లక్షణాలు కనబడతాయని ఆయన వివరించారు. కొంతమందిలో తాము దేవుడిగా భావించడం లేదా అసాధారణ ఆలోచనలు రావడం కూడా జరుగుతుందన్నారు. తీవ్రమైన మానియా దశలో ఆస్పత్రిలో చేర్పించాల్సిన పరిస్థితులు కూడా రావచ్చని తెలిపారు.

Bipolar Disorder Treatment |హైపోమానియా దశలో..

హైపోమానియా దశలో లక్షణాలు తక్కువ తీవ్రతతో ఉంటాయని వైద్యుడు విశాల్​ అన్నారు. సాధారణ జీవితం మీద పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్నారు. అయితే మానియా దశ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని వివరించారు. డిప్రెషన్ దశలో రోజంతా బాధగా అనిపించడం, ఆసక్తి తగ్గడం, నిద్రలో మార్పులు, ఆకలి తగ్గడం లేదా పెరగడం, శక్తి లేకపోవడం, ఏకాగ్రత లోపించడం, ఆత్మన్యూనత భావం, ఆత్మహత్య ఆలోచనలు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఈ వ్యాధికి గల కారణాల్లో మెదడులో జరిగే మార్పులు, చిన్ననాటి చేదు అనుభవాలు, కుటుంబ సమస్యలు, ఇతర శారీరక లేదా మానసిక వ్యాధులు, వంశపారంపర్య ప్రభావం మరియు హార్మోన్ మార్పులు ఉంటాయని వివరించారు.

చికిత్స మార్గాలున్నాయ్​..

బైపోలార్ వ్యాధికి మందులు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (CBT), సీబీటీ, సైకోథెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్, గ్రూప్ థెరపీ వంటి పద్ధతులతో( therapy options) సమర్థవంతంగా చికిత్స చేయవచ్చని విశాల్​ తెలిపారు. ముఖ్యంగా మూడ్​ స్టెబిలైజర్స్​(Mood Stabilizers), యాంటీ సైకోటిక్​ (Antipsychotic) మందులు ఈ వ్యాధిని నియంత్రించడంలో(mental illness India) సహాయపడతాయని చెప్పారు. ఈ వ్యాధిలో కుటుంబ సభ్యుల పాత్ర అత్యంత ముఖ్యమని, రోగి ప్రవర్తనలో మార్పులు గమనించిన వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ (IMA) ప్రధాన కార్యదర్శి హరీష్ స్వామి, వైద్యులు శ్రీశైలం, టీ జీవన్ రావు, రమణేశ్వర్ పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: Naxalism Elimination India | నక్సలిజం నిర్మూలనపై అమిత్ షా కీలక ప్రకటన

Dalit Boycott Complaint | డప్పు కొట్టకపోతే బహిష్కరిస్తారట..పోలీసులకు దళితుల ఫిర్యాదు
Subsidy Tractors Farmers | రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేత
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా
Free Bus Travel | దివ్యాంగులకు గుడ్​న్యూస్​.. ఉచితంగా బస్సు ప్రయాణం
TAGGED:CBT therapydepression and maniaIMA Nizamabadmental health awarenessmental illness IndiaNizamabad health newspsychiatric treatmenttherapy optionsVishal Akula
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Naxalism Elimination India Naxalism Elimination India | నక్సలిజం నిర్మూలనపై అమిత్ షా కీలక ప్రకటన
Next Article Gas Cylinder Black Market Gas Cylinder Black Market | బ్లాక్​లో సిలిండర్ల విక్రయం.. 10 మంది అరెస్ట్
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Advocate Protection Act | పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?