Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gas Cylinder Black Market | బ్లాక్​లో సిలిండర్ల విక్రయం.. 10 మంది అరెస్ట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Gas Cylinder Black Market | బ్లాక్​లో సిలిండర్ల విక్రయం.. 10 మంది అరెస్ట్

క్రైంహైదరాబాద్

Gas Cylinder Black Market | బ్లాక్​లో సిలిండర్ల విక్రయం.. 10 మంది అరెస్ట్

గ్యాస్​​ సిలిండర్లను బ్లాక్​ మార్కెట్​కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న గ్యాంగ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 7:43 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Gas Cylinder Black Market

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gas Cylinder Black Market | పశ్చిమాసియాలో యుద్ధంతో గ్యాస్​ సరఫరాలో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్లపై పరిమితులు విధించింది. గ్యాస్​ కొరతతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో పలు హోటళ్లు, హాస్టళ్లు మూత పడ్డాయి.

గ్యాస్​ సిలిండర్ల కొరతను కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. సిలిండర్లను బ్లాక్​ మార్కెట్​కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇలాంటి ఓ గ్యాంగ్​ను టాస్క్​ఫోర్స్​ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌ (Banjarahills)లోని నాగార్జునఎక్స్‌రోడ్ సమీపంలో హెచ్‌పీగ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వచేసి, విక్రయిస్తున్న 10 మందిని పోలీసులు పట్టుకున్నారు.

Gas Cylinder Black Market | శ్మశానంలో నిల్వ

నిందితులు సిలిండర్లను ఒక శ్మశాన వాటికలో పడేశారు. వినియోగదారులను దోపిడీ చేస్తూ వాటిని అధికధరలకు అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 414 గ్యాస్ సిలిండర్లతో పాటు పలు రవాణా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ.21.88 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. మెట్రో గ్యాస్​ ఏజెన్సీ (Metro Gas Agency) నిర్వహిస్తున్న మహ్మద్​ అమీర్​ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.

కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్​ కొరత కొంత మేర తగ్గింది. మొన్నటి వరకు 50 శాతం వాణిజ్య సిలిండర్లను సరఫరా చేసిన కేంద్రం ప్రస్తుతం 70 శాతానికి పెంచింది. దీంతో హోటళ్లు, రెస్టారెండ్లు, హాస్టళ్లకు సిలిండర్లు లభిస్తున్నాయి. అయితే కొందరు అధిక లాభాల కోసం సిలిండర్లను బ్లాక్​ మార్కెట్​కు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Gandhari Bike Accident | గాంధారిలో విషాదం.. డివైడర్​ను బైక్​ ఢీకొని ముగ్గురి మృతి

Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలెర్ట్​.. రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
Hydraa land seizure | హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 47 వేల గజాల భూమి స్వాధీనం
Samsung Mobile Fraud | తక్కువ ధరకే శాంసంగ్ ఫోన్ అంటూ మోసం.. పార్శిల్ విప్పి చూశాక షాక్‌
Armoor Police | ఆపరేషన్​లో కాలివేలు తీసేస్తారనే భయంతో ప్రాణమే తీసుకున్నాడు..
HIV Injection Attack | పెళ్లికి నిరాకరించిన యువతి… హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన యువకుడు
TAGGED:gas cylinder black marketHyderabad crime newsLPG illegal saleTask force police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bipolar Disorder Treatment | Bipolar Disorder Treatment | బైపోలార్​ వ్యాధికి అనేక చికిత్స మార్గాలు.. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్
Next Article Tadwai Auto Accident | Tadwai Auto Accident | తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?