అక్షరటుడే, కామారెడ్డి: Tadwai Auto Accident | ఆటో బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన (Kamareddy news) తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామ శివారులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
Tadwai Auto Accident | శుభకార్యానికి వెళ్తుండగా..
పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. లింగంపేట(Lingampet) మండలం బాణాపూర్ గ్రామానికి చెందిన 12మంది దోమకొండ మండలం (domakonda) ముత్యంపేట గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్‌కు బయలుదేరారు. తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ వేగంగా ఆటో నడపడంతో అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి(auto overturn incident) బోల్తాపడింది. స్థానికులు గమనించి బోల్తాపడిన ఆటోకింద చిక్కుకున్న వారిని బయటకు లాగారు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన(local news Telangana) డప్పు పోషవ్వ(70)ను మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ తరలించగా(India road safety) చికిత్స పొందుతూ మృతి చెందింది. కామారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డప్పు సాయిలు(57) మృతి చెందాడు. మిగితా వారికి చికిత్స కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
