అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijay Assets Declaration | టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో రూ.603.20 కోట్ల విలువైన మొత్తం ఆస్తులను ప్రకటించారు.
రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఈ అఫిడవిట్‌లో తన వద్ద రూ. 404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. కొడైకెనాల్‌లోని వ్యవసాయ భూమి, చెన్నై (Chennai) వ్యాప్తంగా ఉన్న వాణిజ్య, నివాస భవనాలతో సహా ఆయన స్థిరాస్తుల విలువ సుమారు రూ. 198.62 కోట్లుగా ఉంది. ఆయన భార్య సతీమణి సంగీత రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు, రూ. 25 లక్షల విలువైన స్థిరాస్తులతో కలిపి, మొత్తం రూ. 15.76 కోట్ల విలువైన ఆస్తులను తన కలిగి ఉన్నారు.
Vijay Assets Declaration | రూ.213 కోట్ల డిపాజిట్లు
విజయ్ వ్యక్తిగత చరాస్తులలో చేతిలో ఉన్న రూ. 2 లక్షల నగదు, వివిధ బ్యాంకు ఖాతాలలో ఉన్న రూ. 213 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఆయన వద్ద BMW 530, Toyota Lexus, Toyota Vellfire మరియు BMW i7 వంటి అత్యాధునిక కార్లు ఉన్నాయి. వీటి విలువ భారీగా ఉంటుంది. 883 గ్రాముల బంగారం, రూ. 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో మొత్తం రూ. 184.53 కోట్ల ఆదాయాన్ని ఆయన చూపించారు.
Vijay Assets Declaration | కుటుంబ సభ్యులకు రుణాలు
విజయ్ వివిధ వ్యక్తులకు, కుటుంబ సభ్యులకు భారీగా రుణాలు ఇచ్చారు. TVK ప్రధాన కార్యదర్శి N. ఆనంద్‌కు రూ. 3 కోట్లు, తండ్రి A. చంద్రశేఖర్‌కు రూ. 3.02 కోట్లు, తల్లి శోభా శేఖర్‌కు రూ. 8.71 లక్షలు ఇచ్చినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అంతేగాకుండా తన భార్య సంగీతకు రూ. 12.60 కోట్లు, కుమారుడు జాసన్ సంజయ్‌కు రూ. 8.78 లక్షలు, కుమార్తె దివ్య సాషాకు రూ. 4.60 లక్షలు అప్పుగా ఇచ్చానని పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : UDAN Scheme Expansion | వికసిత్ భారత్ కు ‘ఉడాన్’ ఊతం!.. మరో 100 విమానాశ్రయాల నిర్మాణం వైపు అడుగులు
