Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 31 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. త‌గ్గిన వెండి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 31 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. త‌గ్గిన వెండి

బిజినెస్​తాజా వార్తలు

March 31 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. త‌గ్గిన వెండి

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఆల్‌టైమ్ గరిష్ఠాల నుంచి కొంత తగ్గినప్పటికీ, మంగళవారం బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

Naresh chandan
Last updated: మార్చి 31, 2026 9:19 ఉద.
Naresh chandan
9 గంటలు ago
Share
March 31 Gold Rates
March 31 Gold Rates

అక్షరటుడే, హైదరాబాద్: March 31 Gold Rates | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావం బంగారం, వెండి ధరల్లో Silver Prices స్పష్టంగా కనిపిస్తోంది. పెట్టుబడిగా భావించే బంగారంపై డిమాండ్ పెరగడంతో ధరలు ఒకవైపు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు కొన్ని సంద‌ర్భాల‌లో తగ్గుదల కూడా కనిపిస్తోంది.

Contents
  • March 31 Gold Rates |
    • March 31 Gold Rates | మారుతూ ఉన్న ధ‌ర‌లు..

March 31 Gold Rates |

దేశంలో ఈ రోజు (మార్చి 31) బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,270 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,910గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,48,420కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,910గా ఉంది. దక్షిణ భారత నగరాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది.

March 31 Gold Rates | మారుతూ ఉన్న ధ‌ర‌లు..

హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కేరళ Kerala వంటి ప్రాంతాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,270గా ఉండగా.. చెన్నైలో మాత్రం ఇది రూ.1,50,230కు చేరి కొంచెం ఎక్కువగా నమోదైంది. వడోదరలో రూ.1,48,320, కోల్‌కతా మరియు ముంబైలో రూ.1,48,270గా ధరలు కొనసాగుతున్నాయి.

ఇక వెండి విషయానికి వస్తే, ఇటీవల గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.5 లక్షల మార్క్‌కు దగ్గరగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,55,100గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, వడోదర, అహ్మదాబాద్ నగరాల్లో ఇది రూ.2,44,900గా నమోదైంది.

మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ మార్కెట్లలోని అనిశ్చితి, పశ్చిమాసియా పరిస్థితులు, డాలర్ Dollar మార్పిడి విలువలు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ ధరలు ఇలాగే మారుతూ ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Balka Suman Bail | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
Tulsi Red Thread | తులసి మొక్కకు ఎరుపు దారం కడుతున్నారా.. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా!
Bladder Cancer Symptoms | మూత్రంలో రక్తం కనిపిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే!
Cyber Crime Gang | సైబర్​ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు
Gold After Death | చనిపోయిన వారి నగలకు దోషం ఉంటుందా.. మరణానంతరం వాటిని ఏమి చేయాలి?
TAGGED:Gold Price Updategold rate todayGold Rates IndiaIndia bullion marketMarch 31 Gold Ratesprecious metals newsSilver price todaysilver rates india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ganji Drinks Ganji Drinks | వేసవి తాపాన్ని తరిమికొట్టే అమృతం ‘గంజి’.. ఏ గంజితో ఎలాంటి లాభాలు అంటే!
Next Article Orange Alert Rains | దంచికొట్టిన వాన.. ఉభయ జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​ Orange Alert Rains | దంచికొట్టిన వాన.. ఉభయ జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?