Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Peddi Movie Postponed | ‘పెద్ది’ రిలీజ్‌పై గందరగోళం.. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలపై క్లారిటీ, వాయిదా వార్తలకు చెక్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Peddi Movie Postponed | ‘పెద్ది’ రిలీజ్‌పై గందరగోళం.. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలపై క్లారిటీ, వాయిదా వార్తలకు చెక్

సినిమా

Peddi Movie Postponed | ‘పెద్ది’ రిలీజ్‌పై గందరగోళం.. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలపై క్లారిటీ, వాయిదా వార్తలకు చెక్

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ రిలీజ్ వాయిదాపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు నిర్మాత ఎస్‌కేఎన్ వ్యాఖ్యలు కారణమయ్యాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 9:40 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
16 గంటలు ago
Share
Peddi Movie Postponed

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddi Movie Postponed | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  (Ram Charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Contents
  • Peddi Movie Postponed | క్షమాపణతో క్లారిటీ ఇచ్చిన ఎస్‌కేఎన్
    • Peddi Movie Postponed | వాయిదా వార్తలకు కొంతవరకు చెక్

మేకర్స్ ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది. దీనికి కారణం నిర్మాత ఎస్‌కేఎన్ (Producer SKN) చేసిన వ్యాఖ్యలే కావడం గమనార్హం. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో ఎస్‌కేఎన్ మాట్లాడుతూ, “జూన్ 26న మా సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. కానీ అదే తేదీకి రామ్ చరణ్ ‘పెద్ది’ వస్తుందని తెలిసింది” అని అన్నారు.

Peddi Movie Postponed | క్షమాపణతో క్లారిటీ ఇచ్చిన ఎస్‌కేఎన్

ఈ వ్యాఖ్యలతో ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ జూన్ 26 అని ప్రచారం మొదలైంది. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ వివాదంపై స్పందించిన ఎస్‌కేఎన్ ఓ వీడియో విడుదల చేస్తూ క్లారిటీ ఇచ్చారు. “ఈవెంట్‌లో ఒక చిన్న మిస్ కమ్యూనికేషన్ జరిగింది. ‘పెద్ది’ రిలీజ్ డేట్ గురించి స్పష్టత లేకపోయినా, సోషల్ మీడియా (Social Media)లో వచ్చిన సమాచారం ఆధారంగా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను” అని తెలిపారు. అలాగే, “వేదికపై ఆ ఉత్సాహంలో ‘పెద్ది’ రిలీజ్ గురించి నేను చెప్పిన మాటలు తప్పుగా కన్వే అయ్యాయి. అసలు విషయం తరువాత తెలిసింది. దీనివల్ల గందరగోళం ఏర్పడినందుకు క్షమించాలి” అని అన్నారు.

Peddi Movie Postponed | వాయిదా వార్తలకు కొంతవరకు చెక్

ఎస్‌కేఎన్ పూర్తి క్లారిటీ ఇస్తూ.. పెద్ది సినిమా వాయిదా పడిందనే విషయాన్ని ఎక్కడా వినలేదు. ఎలాంటి మార్పులు ఉంటే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారు” అని తెలిపారు. దీంతో ఇప్పటివరకు వస్తున్న వాయిదా వార్తలకు కొంతవరకు చెక్ పడినట్లైంది. ప్రస్తుతం సినిమా ఏప్రిల్ 30న విడుదల అవుతుందనే అంచనాలు కొన‌సాగుతున్నాయి. మరోవైపు రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. రిలీజ్ డేట్‌పై అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఈ చర్చలు కొనసాగనున్నాయి. అయితే తాజాగా వచ్చిన వివరణతో అభిమానుల్లో కొంత ఊరట కలిగింది.

ఇది కూడా చదవండి..: Sharwanand Biker Transformation | ‘బైకర్’ కోసం శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్.. రోజుకు 32 కి.మీ పరుగులు, రెండేళ్లు కఠిన సాధన

Oscars 2026 | వైభవంగా ప్రారంభమైన 98వ ఆస్కార్ వేడుకలు.. కొత్త కేటగిరీతో చరిత్రలో కీలక మార్పు
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
MS Dhoni Traffic Fine | రూల్స్ ఉల్లంఘించిన ఎంఎస్ ధోని.. ట్రాఫిక్ పోలీసులు ఎంత జ‌రిమానా విధించారంటే..!
Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు
Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
TAGGED:film release newsmovie delay rumorsPeddi movie postponedPeddi release dateProducer SKNRam CharanRam Charan movieSKN clarificationSocial Mediatelugu cinema newstollywood updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Indian Stock Market Crash Indian Stock Market Crash | పశ్చిమాసియా ఉద్రిక్తతల దెబ్బ.. మార్కెట్లలో భారీ పతనం, ఇన్వెస్టర్లకు రూ.51 లక్షల కోట్ల నష్టం
Next Article Telangana BJP Executive Telangana BJP Executive | శాశ్వత ఆహ్వానితులుగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?