అక్షరటుడే, వెబ్‌డెస్క్: ATM Rules April 1 | ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండగా, బ్యాంకింగ్ రంగంలో పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) మార్గదర్శకాలకు అనుగుణంగా పలు బ్యాంకులు తమ లావాదేవీ నిబంధనలను సవరిస్తున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా ATM, UPI వినియోగదారులకు ప్రభావం చూపనున్నాయి.
ఇప్పటివరకు ATM కార్డు లేకుండా UPI QR కోడ్ ద్వారా నగదు ఉపసంహరణ చేసే సౌకర్యాన్ని కొన్ని బ్యాంకులు ఉచితంగా లేదా అదనపు ట్రాన్సాక్షన్‌గా అనుమతించేవి. అయితే ఇక నుంచి ఈ విధానం మారుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank)తో పాటు పలు బ్యాంకులు UPI ఆధారిత ATM విత్‌డ్రాల్స్‌ను కూడా నెలవారీ ఉచిత ట్రాన్సాక్షన్‌లలో భాగంగా పరిగణించనున్నాయి. ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.23తో పాటు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
ATM Rules April 1 | డెబిట్ కార్డులపై విత్‌డ్రా పరిమితి తగ్గింపు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొన్ని డెబిట్ కార్డులపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని సగానికి తగ్గించింది. ఇప్పటివరకు రూ.1,00,000గా ఉన్న పరిమితిని రూ.50,000కు తగ్గించింది. బంధన్ బ్యాంక్ ఖాతాదారులు (Bank Account Holders) తమ సొంత ATMల్లో నెలకు ఐదు సార్లు ఉచితంగా లావాదేవీలు చేయవచ్చు. ఇతర బ్యాంకుల ATMలను వాడితే మెట్రో నగరాల్లో మూడు లావాదేవీలు మాత్రమే ఉచితంగా ఉంటాయి. ఈ పరిమితిని మించిన ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.10 రుసుము వసూలు చేయనుంది.

ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ లావాదేవీల (Digital transactions) భద్రతపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాయి. ఇకపై కేవలం OTP మాత్రమే కాకుండా PIN లేదా బయోమెట్రిక్ ఆధారిత అదనపు ధృవీకరణను తప్పనిసరి చేయనున్నాయి. యాప్‌ల ద్వారా పదేపదే బ్యాలెన్స్ చెక్ చేసే సేవలపై స్వల్ప రుసుములు మాత్రమే ఉండనున్నాయి. అయితే ఇవి నామమాత్రంగానే ఉంటాయని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.ఈ కొత్త మార్పులను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ కస్టమర్లు తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం అవసరం. ఉచిత ట్రాన్సాక్షన్ పరిమితిని మించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అదనపు ఛార్జీలను నివారించవచ్చు.కొత్త ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చిన ఈ మార్పులు బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చే దిశగా కీలకంగా నిలుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Vijay Assets Declaration | టీవీకే చీఫ్ విజయ్ ఆస్తులు రూ.603 కోట్లు
