అక్షరటుడే, వెబ్డెస్క్: GHMC Property Seizure | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు మాజీ ముఖ్యమంత్రి ఇల్లు సీజ్ చేశారు. ఆస్తి పన్ను కట్టకపోవడంతో ఈ మేరకు చర్యలు చేపట్టారు.
జీహెచ్ఎంసీ అధికారులు (GHMC Officers) ఆస్తి పన్ను బకాయిల వసూళ్లలో వేగం పెంచారు. భారీగా బకాయిలు ఉన్న సంస్థలు, భవనాలకు నోటీసులు ఇస్తున్నారు. అయినా స్పందించకపోతే చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ఇల్లును అధికారులు సీజ్ చేశారు.
GHMC Property Seizure | జయలలిత ఇల్లు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత (Jayalalithaa)కు హైదరాబాద్లో ఇల్లు ఉన్న విషయం తెలిసిందే. శ్రీనగర్ కాలనీలోని 8-3-1099/A నంబర్ గల జయలలిత ఇంటికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. 2017 నుంచి ఆ ఇంటి పన్నును చెల్లించలేదు. దీంతో అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందన లేకపోవడంతో ఆమె ఇంటిని సీజ్ చేశారు.
GHMC Property Seizure | రూ.82 లక్షల బకాయిలు
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం వన్ టైం సెటిల్మెంట్ స్కీం అమలు ఉంది. దీంతో రాయితీ పోనూ జయలలిత ఇంటి పన్ను రూ.82.91 లక్షలు బకాయి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఈ భవనంలో ప్రైవేట్ కార్యాలయాలు నిర్వహించారు. దీంతో అధికారులు కమర్షియల్ కాంప్లెక్స్ (Commercial Complex) కింద ఆస్తి పన్నను విధించారు. కాగా ఓటీఎస్ స్కీం కింద ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీకి 90 శాతం మాఫీ అవకాశం కల్పించారు. ఈ గడువు నేటితో మూగియనుంది.
ఇది కూడా చదవండి..: Gas Cylinder Black Market | బ్లాక్లో సిలిండర్ల విక్రయం.. 10 మంది అరెస్ట్
