అక్షరటుడే, వెబ్డెస్క్: Goods Train Derailment | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రెండు వ్యాగన్లు బోల్తా పడ్డాయి. కొమ్మరపూడి రైల్వే జంక్షన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది.
కొమ్మరపూడి రైల్వే జంక్షన్ (Kommarapudi Railway Junction) సమీపంలో ట్యాంకర్ గూడ్స్ రైలు మంగళవారం ఉదయం పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పి బోల్తా పడిన వ్యాగన్లను సరి చేయడానికి 200 మంది సిబ్బంది కృషి చేస్తున్నారు. రైలు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Goods Train Derailment | తాత్కాలిక అంతరాయం
రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ – తిరుపతి, విజయవాడ – చెన్నై, కొమ్మరపూడి జంక్షన్ – కృష్ణపట్నం మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లు స్టేషన్లలో నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాగన్లను తొలగించి, రైళ్ల రాకపోకలను త్వరలో పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Amaravati Capital Decision | కీలక అడుగు..అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ఏకగ్రీవ తీర్మానం, ఏప్రిల్ 1న ఆమోదించనున్న కేంద్రం
