అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kaushik Reddy CID Notices | హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి (MLA Padi Kaushik Reddy) సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశించారు.
కరీంనగర్ జిల్లా వీణవంకలో జనవరిలో మినీ మేడారం జాతర జరిగింది. ఈ వేడుకలకు జనవరి 29న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు, అనుచరులతో వెళ్లారు. అయితే మార్గమధ్యలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అంతమంది వెళ్లడానికి అనుమతించలేదు. దీంతో కౌశిక్‌రెడ్డి రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరీంనగర్ సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనపై మతం పేరుతో వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పుడు పెద్ద దుమారం రేగింది. ఐపీఎస్ అసోసియేషన్ సైతం ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించింది. దీంతో ఎమ్మెల్యే క్షమాపణలు సైతం చెప్పారు.
Kaushik Reddy CID Notices | సీఐడీ విచారణ
పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ కమిషనర్ (Karimnagar Commissioner) పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు పెట్టారు. ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు తాజాగా నోటీసులు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన అసెంబ్లీలో కడియం శ్రీహరిపై అనుచితంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఎథిక్స్ కమిటీకి పంపారు. కొంతకాలంగా బీఆర్ఎస్లో దూకుడుగా ఉంటూ.. కాంగ్రెస్ పార్టీ (Congress Party), ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న కౌశిక్‌రెడ్డికి నోటీసులు రావడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. నోటీసులపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి..: Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్‌పై జీవన్ రెడ్డి ఫైర్!
