అక్షరటుడే, వెబ్డెస్క్: April 2026 Money Rules | ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి (2026-27) అడుగుపెట్టబోతున్నాం. ఈ సమయంలో ఆర్థిక సంబంధమైన పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కొత్త బ్యాంకింగ్ నిబంధనలను అమలు చేయబోతోంది. కస్టమర్లకు మేలు చేసేలా, పారదర్శకత పెంచేలా ఈ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పులేవో తెలుసుకుందామా..
April 2026 Money Rules | నలుగురు నామినీలకు అవకాశం..
బ్యాంకు ఖాతాలు, లాకర్లకు ఇప్పటివరకు గరిష్టంగా ఇద్దరు నామినీలను మాత్రమే చేర్చుకునే అవకాశం ఉంది. దీనిని నాలుగుకు పెంచారు.
గోల్డ్ లోన్ గడువు పెంపు గోల్డ్ మెటల్ లోన్ రీపేమెంట్ గడువును 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచారు. ఇది వ్యాపారులకు ఊరట కలిగించే విషయం.
April 2026 Money Rules | ప్రీపేమెంట్ చార్జీలు సున్నా..
ఫ్లోటింగ్ రేటు ఉన్న హోమ్, కార్, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్లను ముందుగానే చెల్లిస్తే ఇకపై ఎలాంటి చార్జీలు వసూలు చేయరు. బ్యాంకు రుణాలను త్వరగా తీర్చేయాలనుకుంటున్నవారికి ఊరట లభించే నిర్ణయమిది.
April 2026 Money Rules | వారానికోసారి సిబిల్ స్కోర్ అప్‌డేట్..
ప్రస్తుతం నెలకు ఒకసారి మాత్రమే సిబిల్ స్కోర్ అప్ డేట్ అవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ గడువును వారానికి కుదించారు. ఇకపై ప్రతినెలా 7, 14, 21, 28 తేదీల్లో అప్ డేట్ అవుతుంది. అప్పు చెల్లిస్తే వెంటనే ప్రభావం కనిపిస్తుందన్నమాట.. క్రెడిట్ స్కోర్ త్వరగా అప్‌డేట్ అవడంతో మంచి స్కోర్ ఉన్నవారు వెంటనే తక్కువ వడ్డీ రేట్లకు లోన్లు పొందే అవకాశం చిక్కుతుంది.
నగదు విత్‌డ్రా పరిమితి కుదింపు..
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రోజువారీ ఏటీఎం (ATM) నగదు విత్‌డ్రా లిమిట్స్ మారాయి. ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై విత్‌డ్రా పరిమితిని 50 శాతానికి తగ్గించారు.
రూ. 10 లక్షలు దాటితే పాన్ తప్పనిసరి..
ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదును ఒకేసారి జమ చేసినా లేదా విడతల వారీగా జమ చేసినా, విత్ డ్రా చేసినా పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక రోజులో రూ. 50 వేలు దాటితే పాన్ వివరాలు అడుగుతున్నారు.
బ్యాంక్ సేవా రుసుముల భారం..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఏటీఎం నుంచిి నగదు ఉపసంహరణ పరిమితులు దాటితే వసూలు చేసే చార్జీలు, బ్యాంక్ లాకర్ ఫీజులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు అమలులోకి రానున్నాయి.
2 ఫ్యాక్టర్ అథెంటికేషన్..
ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డిజిటల్ పేమెంట్లలో భద్రతను పెంచింది. ఇప్పటివరకు ఓటీపీ మాత్రమే వచ్చేది. కానీ ఏప్రిల్ 1 నుంచి పేమెంట్ చేసేటప్పుడు మరొక అదనపు భద్రతా ఫీచర్ (బయోమెట్రిక్ లేదా యాప్ అప్రూవల్ వంటివి) తప్పనిసరి కానున్నాయి. ఇది లావాదేవీలను మరింత సురక్షితం చేస్తుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Temple Stampede Bihar | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి
