అక్షరటుడే, బాల్కొండ: Labour Codes Protest | కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని టీయూసీఐ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని బస్సాపూర్, కిసాన్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద లేబర్ కోడ్ ప్రతులను దహనం చేశారు.
Labour Codes Protest | కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు..
ఈ సందర్భంగా టీయూసీఐ (TUCI) రాష్ట్ర కార్యదర్శి ఎం. ముత్తెన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను (Labour Codes) తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టాలు పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా కార్మికులు, కార్మిక సంఘాలు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే ఈ నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు (TUCI Leaders) ఎండీ నజీర్, నిమ్మల నిఖిల్, వినోద్ కుమార్, దినేష్, రాజేష్, రాజు, విజయ, విజయ, విజయ, లక్ష్మీ, కీర్తన, గంగాధర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Unseasonal Rains | అకాల వర్షం ఎఫెక్ట్.. నిజామాబాద్ మార్కెట్‌యార్డ్‌లో తడిసిన పసుపు
