Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: FIIs Stock Market Sale | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 1.22 లక్షల కోట్ల షేర్లు అమ్మేసిన ఎఫ్ఐఐలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - FIIs Stock Market Sale | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 1.22 లక్షల కోట్ల షేర్లు అమ్మేసిన ఎఫ్ఐఐలు

బిజినెస్​

FIIs Stock Market Sale | స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. రూ. 1.22 లక్షల కోట్ల షేర్లు అమ్మేసిన ఎఫ్ఐఐలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంనుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న స్టాక్ మార్కెట్.. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మళ్లీ కుదేలయ్యింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 2:42 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
13 గంటలు ago
Share
FIIs Stock Market Sale

అక్షరటుడే, వెబ్​డెస్క్: FIIs Stock Market Sale | దేశీయ స్టాక్ మార్కెట్ గత ఏడాదిన్నరగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండో పర్యాయం అధికారంలోకి వచ్చినప్పటినుంచి పతనం ప్రారంభమైంది. వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలను విధించడంతో సూచీలు పతనమయ్యాయి.

Contents
  • FIIs Stock Market Sale | డీఐఐలు కొంటున్నా ఆగని పతనం..
    • FIIs Stock Market Sale | కొవిడ్ క్రాష్‌కు మించి..
      • FIIs Stock Market Sale | పది శాతానికిపైగా పడిపోయిన సెన్సెక్స్, నిఫ్టీ..

వాటి ప్రభావంనుంచి మార్కెట్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే గతనెలలో ఇరాన్‌పై అమెరికా దాడితో మళ్లీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడి మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. మార్చి నెల ఇన్వెస్టర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. సుమారు రూ. 50 లక్షల కోట్లకుపైనే సంపద హరించుకుపోయింది.

FIIs Stock Market Sale | డీఐఐలు కొంటున్నా ఆగని పతనం..

స్టాక్ మార్కెట్ (Stock Market)లో పతనాన్ని అడ్డుకోవడానికి దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మార్చిలో నికరంగా రూ. 1,42,960 లక్షల కోట్ల విలువైన స్టాక్ కొనుగోలు చేశారు. అయితే ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మాత్రం రేపన్నదే లేదన్నట్లుగా అమ్మకాలకు పాల్పడుతూనే ఉన్నారు. వారు ఒక్క మార్చి నెలలోనే నికరంగా రూ. 1,22,540 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ అమ్మేశారు.

FIIs Stock Market Sale | కొవిడ్ క్రాష్‌కు మించి..

ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ (Crude oil) ధరలు విపరీతంగా పెరుగుతుండడం, డాలర్ బలపడుతుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. విదేశీ సంస్ధాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని పెద్ద మొత్తంలో ఉపసంహరించుకుంటుండడంతో రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడి వారూ భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఎఫ్ఐఐలు కొవిడ్ క్రాష్‌కు మించి ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో అమ్మకాలకు పాల్పడుతున్నారు. కోవిడ్ సమయంలో 2020 మార్చిలో ఎఫ్ ఐఐలు నికరంగా రూ. 65,816 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ప్రస్తుత మార్చిలో ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, దీని ప్రభావంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉండడం, రూపాయి విలువ భారీగా పతనమవుతుండడం వంటి అంశాలూ ఎఫ్ఐఐల అమ్మకాలకు కారణమవుతున్నాయి.

FIIs Stock Market Sale | పది శాతానికిపైగా పడిపోయిన సెన్సెక్స్, నిఫ్టీ..

యుద్ధం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మార్చిలో పది శాతానికిపైగా పతనమయ్యింది. మార్చి ప్రారంభంలో 80,238 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్.. నెలాఖరుకు వచ్చేసరికి 71,947 పాయింట్లకు పడిపోయింది. నెలరోజుల్లో 8,291 పాయింట్లు కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ సైతం భారీగా నష్టపోయింది. మార్చిలో 24,865 పాయింట్లనుంచి 22,331 పాయింట్లకు తగ్గింది. ఒక్క నెలరోజుల్లోనే నిఫ్టీ 2,534 పాయింట్లు తగ్గడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: Ganji Drinks | వేసవి తాపాన్ని తరిమికొట్టే అమృతం ‘గంజి’.. ఏ గంజితో ఎలాంటి లాభాలు అంటే!

March 18 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ
Iran Gulf Attacks | గల్ఫ్​ దేశాలపై ఇరాన్​ దాడులు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Stock Market Rally | బుల్ జోరు.. రాణించిన సూచీలు.. రూ. 6 లక్షల కోట్లు పెరిగిన సంపద
Stock Market Volatility | వీడని యుద్ధ భయాలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాటలో మార్కెట్లు
March 07 Gold Silver Rates | ప‌సిడి ప్రియుల‌కి శుభ‌వార్త‌.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!
TAGGED:Crude OilDomestic Stock MarketDonald TrumpFIIs Stock Market SaleStock Market
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Assam BJP Manifesto Assam BJP Manifesto | ప్రతి కుటుంబానికి ఇల్లు.. మహిళలకు నెలకు రూ.3వేలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల
Next Article PAN and Banking Changes PAN and Banking Changes | పాన్ కార్డ్ నుంచి బ్యాంకింగ్ సేవల వరకు.. రేపటినుంచి అమలులోకి పలు మార్పులు
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: ITR Forms | ఐటీఆర్​ ఫారాలను నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?