Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Godavari Pushkaralu Arrangements | గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Godavari Pushkaralu Arrangements | గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

నిజామాబాద్

Godavari Pushkaralu Arrangements | గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

వచ్చే ఏడాది జూలైలో జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 2:56 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
Godavari Pushkaralu Arrangements

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Godavari Pushkaralu Arrangements | వచ్చే ఏడాది జూలైలో జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్​ను కలెక్టర్ (Collector Ila Tripathi) మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.

Contents
  • Godavari Pushkaralu Arrangements | అధికారులకు సూచనలు..సలహాలు..
    • Godavari Pushkaralu Arrangements | లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు ఉండాలి..

Godavari Pushkaralu Arrangements | అధికారులకు సూచనలు..సలహాలు..

పక్షం రోజుల క్రితం సైతం పుష్కర ఘాట్ (Pushkara Ghat)​ను సందర్శించిన సమయంలో అధికారులకు అప్పగించిన పనులను కలెక్టర్​ మంగళవారం తనిఖీ చేశారు. పుష్కర ఘాట్​కు వచ్చేమార్గాల్లో రహదారుల మరమ్మతులు, విస్తరణ పనులను, శివాలయం వద్ద కొనసాగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టాలన్నారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాలలోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు భక్తులకు కనీస వసతులు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. గోదావరి పుష్కరాలకు (Godavari Pushkaralu) త్రివేణి సంగమ ప్రాంతం అయినందున ఈ ఘాట్ వద్ద పుణ్య స్నానాల కోసం ప్రముఖులతో పాటు, లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.

Godavari Pushkaralu Arrangements | లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు ఉండాలి..

ఘాట్​ వద్ద ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాకపోకలకు ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు ఆయా మార్గాలలో అవసరమైన చోట కల్వర్టుల నిర్మాణాలు సైతం చేపట్టాలన్నారు. వీవీఐపీల కోసం హెలిప్యాడ్​ను నిర్మించాలని, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటి వాటిని నాణ్యతతో చేపట్టి నిర్ణీత గడువు లోపు పూర్తి చేసేలా చూడాలన్నారు. ఘాట్ వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు కందకుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెంజల్ మండల (Renjal Mandal) అధికారులతో సమావేశమయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, జనాభా గణన ప్రక్రియల నిర్వహణపై కీలక సూచనలు చేశారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato), దేవాదాయ శాఖ అధికారులు కమల, విజయరామారావు, తహశీల్దార్ శ్రవణ్, ఇరిగేషన్, ఆర్అండ్​బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Labour Codes Protest | లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే.. టీయూసీఐ ఆధ్వర్యంలో నిరసన

Red Sorghum Farmers Demand | ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే కొనుగోలు చేయాలి
Mopal Police Inspection | మోపాల్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య
SSC Exams Nizamabad | ఎస్సెస్సీ పరీక్షల తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. చీఫ్​ సూపరింటెండెంట్​కు​ షోకాజ్ ఇవ్వాలని ఆదేశం..​
Six Guarantees Legal Status | ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
Yellareddy Development Funds | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.14.50 కోట్ల నిధులు మంజూరు
TAGGED:Collector Ila Tripathidistrict collector newsGodavari Pushkaralu ArrangementsNizamabad Newspilgrimage arrangementsPushkara GhatPushkaralu preparationsRenjal Mandalriver ghat worksSub-Collector Vikas MahatoTelangana administrationtemple infrastructure
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article PAN and Banking Changes PAN and Banking Changes | పాన్ కార్డ్ నుంచి బ్యాంకింగ్ సేవల వరకు.. రేపటినుంచి అమలులోకి పలు మార్పులు
Next Article Makloor Society Protest Makloor Society Protest | మాక్లూర్​ సొసైటీలో అక్రమాలపై సభ్యుల ఆందోళన
2 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Hanuman Jayanti Rally | ర్యాలీలో డీజేలకు పర్మిషన్ లేదు
  • పింగుబ్యాకు: Bike Accident | చీరకొంగు బైక్​లో చిక్కుకుని మహిళ మృతి

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?