Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hanuman Jayanti | హనుమాన్ జయంతి పూజా ముహూర్తం ఎప్పుడు.. ఆరోజు దానాలు చేస్తే లాభాలేంటి?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - Hanuman Jayanti | హనుమాన్ జయంతి పూజా ముహూర్తం ఎప్పుడు.. ఆరోజు దానాలు చేస్తే లాభాలేంటి?

భక్తితాజా వార్తలు

Hanuman Jayanti | హనుమాన్ జయంతి పూజా ముహూర్తం ఎప్పుడు.. ఆరోజు దానాలు చేస్తే లాభాలేంటి?

హనుమంతుడు అంటే కేవలం శారీరక బలం మాత్రమే కాదు, అపారమైన జ్ఞానం, వినయానికి ఆయన ఒక నిదర్శనం. తన బలాన్ని ఎప్పుడూ అహంకారంతో ప్రదర్శించకుండా, తన జీవితాన్ని రామ సేవకే అంకితం చేసిన పరమ భక్తుడు. అందుకే తులసీదాస్ వంటి వారు ఆయన్ను 'మహాతపస్వి' అని ప్రశంసించారు.

Naresh chandan
Last updated: మార్చి 31, 2026 7:02 సా.
Naresh chandan
6 గంటలు ago
Share
Hanuman Jayanti
Hanuman Jayanti

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hanuman Jayanti | శక్తికి, భక్తికి నిలువుటద్దం హనుమంతుడు. కలియుగంలో భక్తుల కష్టాలను తీర్చే చిరంజీవిగా ఆంజనేయస్వామిని ఆరాధిస్తాం. ముఖ్యంగా చైత్ర పౌర్ణమి నాటికి ఒక ప్రత్యేకత ఉంది. ఉత్తర భారత సంప్రదాయం ప్రకారం ఈ రోజే స్వామివారి జన్మదినం.

Contents
  • Hanuman Jayanti | ముహూర్తం, తిథి వివరాలు:
    • Hanuman Jayanti | పూజా విధానం:
      • Hanuman Jayanti | పాటించాల్సిన నియమాలు:

మరికొన్ని చోట్ల హనుమంతుడు శ్రీరాముడిని కలిసిన విజయ దినంగా దీనిని పరిగణిస్తారు. ఈ ఏడాది (2026) ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ పవిత్ర పర్వదినం ప్రాముఖ్యం, పూజా విధానం , పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Hanuman Jayanti | ముహూర్తం, తిథి వివరాలు:

పంచాంగం ప్రకారం.. చైత్ర పౌర్ణమి తిథి ఏప్రిల్ 1, బుధవారం ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 2, గురువారం ఉదయం 7:41 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయ తిథిని పరిగణనలోకి తీసుకుంటే, ఏప్రిల్ 2వ తేదీ, గురువారం నాడు హనుమాన్ జయంతిని నిర్వహించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ దశమి నాడు కూడా హనుమజ్జయంతిని ఘనంగా జరుపుకొంటారు. ఈ రెండు సమయాల్లోనూ భక్తులు 41 రోజుల పాటు హనుమాన్ దీక్ష చేపట్టి స్వామిని కొలుస్తారు.

Hanuman Jayanti | పూజా విధానం:

అభ్యంగన స్నానం: జయంతి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, శుచిగా స్నానం ఆచరించాలి.

సింధూర సమర్పణ: హనుమంతునికి సింధూరం అంటే అత్యంత ప్రీతి. గుడికి వెళ్లి స్వామికి సింధూరాన్ని సమర్పించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి.

రామ నామ స్మరణ: ఆంజనేయుడిని పూజించే ముందు సీతారాములను స్మరించుకోవాలి. ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని నమ్మకం.

అర్చన: ఎర్ర చందనం, అక్షింతలు, ఎర్రని పూలు, నైవేద్యంగా అప్పాలను సమర్పించాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

పారాయణం: హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించడం వల్ల మానసిక ధైర్యం కలుగుతుంది.

నైవేద్యం: భక్తి శ్రద్ధలతో హనుమంతునికి అప్పాలు, వడలు లేదా అరటి పండ్లను నైవేద్యంగా నివేదించాలి.

Hanuman Jayanti | పాటించాల్సిన నియమాలు:

సాత్విక జీవనం: ఈ పర్వదినాన మాంసాహారం, మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యాన్ని పాటించడం ముఖ్యం.

నేలపై నిద్ర: ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా హనుమత్ స్మరణలో గడుపుతూ, రాత్రి వేళ నేలపై నిద్రించడం ఉత్తమం.

జీవకారుణ్యం: హనుమంతుని స్వరూపంగా భావించే వానరాలకు బెల్లం లేదా అరటి పండ్లు తినిపించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది.

దానధర్మాలు: శక్తి కొలది పేదలకు అన్నదానం లేదా వస్తు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.

మంత్ర జపం: పూజ సమయంలో “ఓం హం హనుమతే నమః” లేదా “ఓం నమో భగవతే హనుమతే నమః” వంటి మంత్రాలను జపించడం మంచిది.

ఇది కూడా చదవండి: Karna | కర్ణ మరణం నుంచి కష్టాల వరకు.. ‘సవాలక్ష’ అనే పదం ఎలా వచ్చిందంటే!

Osmania Biscuits Adulteration | క్యాన్సర్​ కారకాలతో ఉస్మానియా బిస్కెట్ల తయారీ
Telangana IPS Cadre | కేంద్ర మంత్రి అమిత్​షాతో సీఎం రేవంత్​ భేటీ.. ఐపీఎస్​లను కేటాయించాలని విన్నపం!
March 13 Gold Prices | బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
Hyderabad Traffic Restrictions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
Ramlalla Darshan | చైత్ర నవరాత్రి అష్టమి సందర్భంగా శ్రీ రామలల్లా దివ్య దర్శనం
TAGGED:Hanuman ChalisaHanuman JayantiHanuman Jayanti 2026Hanuman PujaHindu festivalsindian traditionsPuja Muhuratspiritual rituals
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ITR Forms ITR Forms | ఐటీఆర్​ ఫారాలను నోటిఫై చేసిన కేంద్రం
Next Article Makloor society dispute | Makloor society dispute | రసాభాసగా మాక్లూర్​ సొసైటీ సమావేశం.. గత పాలకవర్గంపై చర్యలకు సభ్యుల డిమాండ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?