అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Police Inspector Transfers | రాష్ట్ర ప్రభుత్వం పలువురు పోలీసు ఇన్స్పెక్టర్ల (Inspectors)ను బదిలీ చేసింది. మల్టీ జోన్–1 పరిధిలో ఏడుగురు సీఐలకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి (Multi Zone-1 IG) ఉత్తర్వులు జారీ చేశారు.
వెయిటింగ్లో ఉన్న వర్స వినయ్‌కుమార్ మహబూబాబాద్ గూడూరు సీఐగా బదిలీ అయ్యారు. అక్కడ పని చేస్తున్న జీడీ సూర్య ప్రకాశ్‌ను ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. రైల్వేశాఖలో ఓడీపై సీఐగా పని చేస్తున్న ఎన్ అంజలి (CI Anjali) మహబూబాబాద్ రూరల్ సీఐగా వెళ్లనున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పి సర్వయ్యను ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
Police Inspector Transfers | రిలీవ్ చేయాలి
సిద్దిపేట (Siddipet) సీఎస్‌బీలో పని చేస్తున్న పల్లె శ్రీధర్ గౌడ్ కామారెడ్డి రూరల్ సీఐగా బదిలీ (Police Inspector Transfers) అయ్యారు. అక్కడ పని చేస్తున్న రామన్ ఐజీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. వెయిటింగ్లో ఉన్న సీహెచ్ విద్యాసాగర్‌ను ప్రభుత్వం రామగుండం సీసీఎస్‌కు బదిలీ చేసింది. వారిని వెంటనే రిలీవ్ చేయాలని ఐజీ సూచించారు. ట్రాన్స్ఫర్ అయిన అధికారులు కొత్త పోస్టింగ్‌లో వెంటనే జాయిన్ కావాలని ఆదేశించారు.
దీనిని కూడా చదవండి : Bike Stunt Case | పోలీసుల ముందు బైక్‌తో స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
