అక్షరటుడే, హైదరాబాద్: April 01 Gold Rates | మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైన బంగారం ధరలు ఇటీవలి కాలంలో తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. ఒకప్పుడు దాదాపు రూ.1.80 లక్షల వరకు చేరిన ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక్కసారిగా రూ.30 వేల వరకు పడిపోయాయి.
దీంతో బంగారం ధరలు లక్ష రూపాయల దాకా పడిపోతాయని భావించినప్పటికీ, డాలర్ విలువ పెరగడంతో మళ్లీ గోల్డ్ రేట్లు పైకి ఎగబాకుతున్నాయి. ఏప్రిల్ 1, 2026 బుధవారం నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులతో నమోదయ్యాయి.
April 01 Gold Rates | పెరుగుతున్న ధరలు..
హైదరాబాద్‌లో Hyderabadలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31న రూ.1,49,510 ఉండగా, ఏప్రిల్ 1న రూ.10 పెరిగి రూ.1,49,520కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,050 నుండి రూ.1,37,060కు పెరిగింది.
విజయవాడ Vijayawadaలో కూడా ఇదే ధోరణి కొనసాగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,49,520గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరిగి రూ.1,37,060గా ఉంది.
చెన్నైలో మాత్రం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,130 నుండి రూ.1,49,120కు పడిపోయింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,700 నుండి రూ.1,36,690కు తగ్గింది.
April 01 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముఖ్యంగా డాలర్ బలపడటం, జియోపాలిటికల్ టెన్షన్స్ ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. పెట్టుబడిదారులు సేఫ్ హేవెన్‌గా గోల్డ్‌ను ఎంచుకోవడం వల్ల డిమాండ్ పెరుగుతోంది.
బంగారం ధరలు Gold Rates రోజువారీ మార్పులతో ఉండటంతో కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్ పరిస్థితులను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆ మధ్య కాస్త తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతూ పోతుండడం మాత్రం కొంత ఆందోళనకి గురి చేస్తుంది. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం పరుగులు పెడుతుండడం సామాన్యుడికి ఇబ్బందిగా మారింది.
