అక్షరటుడే, వెబ్డెస్క్ : Gas Shortage Protest | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత (Gas Shortage) నెలకొన్న విషయం తెలిసిందే. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు ఇబ్బందులు లేకున్నా.. వాణిజ్య సిలిండర్లు, వాహనాలకు వినియోగించే గ్యాస్ దొరకడం లేదు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఎంతో మంది ఆటో నడుపుతూ జీవనం సాగిస్తారు. చాలా వరకు ఆటోల్లో ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ వినియోగిస్తున్నారు. ఈ గ్యాస్ కొరతతో తమ ఉపాధి దెబ్బ తింటుందని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. తాజాగా హైదరాబాద్ ఎల్బీనగర్ సాగర్ రింగు రోడ్డు (LB Nagar Sagar Ring Road) వద్ద ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు.
Gas Shortage Protest | భారీగా ట్రాఫిక్ జామ్
గంటల తరబడి వేచి ఉన్నా గ్యాస్ లభించడం లేదని ఆటో డ్రైవర్లు (Auto Drivers) ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్పీజీ గ్యాస్ కొరతను నిరసిస్తూ హైవేపై ఆటోలను అడ్డంగా నిలిపి నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
కాగా నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు (Commercial Gas Cylinders) కూడా దొరకడం లేదు. దీనిని ఆసరాగా చేసుకొని పలువరు బ్లాక్లో దందాకు తెరలేపారు. సిలిండర్లు దొరకక పలు హోటళ్లు మూతపడ్డాయి. మరికొన్నింట్లో రేట్లు పెంచి ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Market Recovery Bonus Fake | రూ. 10వేల ‘మార్కెట్ రికవరీ బోనస’.. ఉత్త ఫేక్ న్యూస్
