Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Recovery | హమ్మయ్య.. మార్కెట్ కోలుకుంది రూ. 13 లక్షల కోట్లు పెరిగిన సంపద
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Recovery | హమ్మయ్య.. మార్కెట్ కోలుకుంది రూ. 13 లక్షల కోట్లు పెరిగిన సంపద

బిజినెస్​

Stock Market Recovery | హమ్మయ్య.. మార్కెట్ కోలుకుంది రూ. 13 లక్షల కోట్లు పెరిగిన సంపద

వరుస నష్టాలతో కుదేలవుతున్న దేశీయ మార్కెట్లు.. బుధవారం కోలుకున్నాయి. భారీ లాభాల దిశగా సాగుతున్నాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 10:30 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Stock Market Recovery

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Recovery | పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కుదేలవుతున్న స్టాక్ మార్కెట్‌ (Stock Market)లో బుధవారం రిలీఫ్ ర్యాలీ కనిపిస్తోంది. ఈరోజు బేర్స్‌పై బుల్స్‌దే పైచేయిగా కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లు (Global Markets) పాజిటివ్‌గా ఉండడం, అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం వంటి అంశాలు కలిసొచ్చాయి.

Contents
  • Stock Market Recovery | భారీ లాభాలతో ప్రారంభం..
    • Stock Market Recovery | మార్కెట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే..

Stock Market Recovery | భారీ లాభాలతో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 1,815 పాయింట్లు, నిఫ్టీ 568 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 73,546 పాయింట్లనుంచి 73,917 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 22,809 నుంచి 22,937 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత నిఫ్టీ 50 ఇండెక్స్‌లో అన్ని స్టాక్స్ లాభాలతో సాగుతున్నాయి. ఇండిగో 8.52 శాతం, బీఈఎల్ 6.86 శాతం, ట్రెంట్ 6.63 శాతం, అదాని పోర్ట్స్ 4.95 శాతం, టీసీఎస్ 4.66 శాతం లాభాలతో ఉన్నాయి. అన్ని ఇండెక్స్ లూ భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.

Stock Market Recovery | మార్కెట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే..

రెండు, మూడు వారాల్లో ఇరాన్‌పై సైనిక దాడులను ముగించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతోపాటు యుద్ధం ముగించడానికి అమెరికాతో సందేశాలు పంపించుకున్నామని ఇరాన్ విదేశాంగ శాఖ ధ్రువీకరించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరచింది. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్‌లో బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 10 శాతానికిపైగా పడిపోయాయి. గత రెండు సెషన్లలోనే భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో బ్లూచిప్ స్టాక్స్‌లో వాల్యూ బయ్యింగ్ కు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధర కొంత తగ్గడం, రూపాయి బలపడడంతో మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి.
బుధవారం తొలి అరగంటలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 13 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 412 లక్షల కోట్లనుంచి రూ. 425 లక్షల కోట్లకు చేరింది.

ఇది కూడా చదవండి..: ITR Forms | ఐటీఆర్​ ఫారాలను నోటిఫై చేసిన కేంద్రం

Axis Finance | వినియోగదారుల భద్రతకు పెద్దపీట.. ఏఐ మానిటరింగ్‌ను ప్రారంభించిన యాక్సిస్ ఫైనాన్స్
Tata EV Discount | టాటా ఆఫర్​.. ఈవీ కార్లపై 20 శాతం రాయితీ
Denza Z9 GT | ఐదు నిమిషాల్లో 70 శాతం చార్జింగ్.. అదుర్స్ అనిపించే ఫీచర్లతో బీవైడీ ఈవీ కారు
March 21 Gold Rates | పసిడి ధరలకు బ్రేక్… ఒక్కసారిగా భారీ పతనం, కొనుగోలుదారులకు ఊరట!
Stock Market Loss India | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
TAGGED:Domestic Stock Marketequity market updateGlobal MarketsIndian Stock Marketinvestor wealth gainmarket rebound indianifty surge indiasensex rally todayshare market newsStock Market Recovery
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gas Shortage Protest Gas Shortage Protest | గ్యాస్​ కోసం ఆటో డ్రైవర్ల ఆందోళన
Next Article Gas Cylinder Shortage Gas Cylinder Shortage | నగరంలో గ్యాస్​ కోసం వినియోగదారుల ఆందోళన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?