Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bal Bhavan Summer Classes | బాల్​భవన్​లో వేసవి శిక్షణ తరగతులకు సర్వం సిద్ధం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bal Bhavan Summer Classes | బాల్​భవన్​లో వేసవి శిక్షణ తరగతులకు సర్వం సిద్ధం..

నిజామాబాద్

Bal Bhavan Summer Classes | బాల్​భవన్​లో వేసవి శిక్షణ తరగతులకు సర్వం సిద్ధం..

బాల్​భవన్​లో వేసవి శిక్షణ తరగతులు ప్రతిఏడాది ఏప్రిల్​, మే నెలల్లో నిర్వహిస్తుంటారు. చిన్నారుల వేసవి సెలవును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక తరగతులు ప్రారంభించనున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 4:22 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
Bal Bhavan Summer Classes

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bal Bhavan Summer Classes | నేటితరంలో పిల్లలు స్కూళ్లు ముగిశాక దాదాపుగా ఫోన్లలోనే మునిగిపోతున్నారు. వేసవి సెలవుల్లో దాదాపు రెండు నెలలు చిన్నారులను ఫోన్లు, టీవీల నుంచి దూరంగా ఉంచడం అనేది తల్లిదండ్రులకు కత్తిమీద సామే అని చెప్పారు. వీటి నుంచి పిల్లలను దూరంగా ఉంచేందుకు బాల్​భవన్​ చక్కని వేదికగా మారింది.

Contents
  • Bal Bhavan Summer Classes | శిక్షణ కాలం వివరాలు..
    • Bal Bhavan Summer Classes | ప్రవేశానికి అర్హతలివే..
      • Bal Bhavan Summer Classes | ఏయే అంశాల్లో శిక్షణ ఇస్తారు..
        • Bal Bhavan Summer Classes | విద్యార్థులకు సదవకాశం..

బాల్​భవన్​ (Bal Bhavan)లో వేసవి శిక్షణ తరగతులు ప్రతిఏడాది ఏప్రిల్​, మే నెలల్లో నిర్వహిస్తుంటారు. చిన్నారుల వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు 2026లో నగరంలోని బాల్​భవన్​లో ఏప్రిల్​ 20వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.

Bal Bhavan Summer Classes | శిక్షణ కాలం వివరాలు..

బాల్​భవన్​లో వచ్చేనెల 20వ తేదీ నుంచి జూన్​ 10వ తేదీ వరకు వివిధ అంశాల్లో విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థుల వేసవి సెలవులు (Summer Holidays)  వృథాగా పోనీయకుండా బాలబాలికల అభిరుచులను బట్టి వారికిష్టమైన అంశాల్లో తర్ఫీదునిస్తారు. వేసవి శిక్షణ తరగతులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30వరకు జరుగుతాయి. కార్యాలయం ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉంటుంది. ఈ వేళల్లో విద్యార్థుల కోసం వారికిష్టమైన అంశాల్లో అడ్మిషన్​ తీసుకోవచ్చు.

Bal Bhavan Summer Classes | ప్రవేశానికి అర్హతలివే..

బాల్​భవన్​లో చేరాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా రెండు పాస్​పోర్టు సైజు ఫొటోలు, డేట్​ ఆఫ్​ బర్త్​ సర్టిఫికెట్​ అడ్మిషన్​ సమయంలో తీసుకురావాలి. అలాగే విద్యార్థి నాలుగు లేదా ఐదు అంశాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఆరేళ్ల వయస్సు నుంచి పదహారేళ్ల వయస్సు వరకు విద్యార్థులు బాల్​భవన్​లో చేరవచ్చు.

Bal Bhavan Summer Classes | ఏయే అంశాల్లో శిక్షణ ఇస్తారు..

బాల్​భవన్​లో మొత్తంగా 30 అంశాల్లో చిన్నారులకు శిక్షణ ఇస్తారు. వీటికి సంబంధించి సుశిక్షుతులైన ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారు. డ్రాయింగ్​, పెయింటింగ్​, భరతనాట్యం, జానపద నృత్యం, కర్ణాటక గాత్ర సంగీతం, లలిత సంగీతం, టైలరింగ్​, ఎంబ్రాయిడరీ, గ్లాస్​ పేయింటింగ్​, ఫ్లవర్​ వాజ్​ల తయారీ, ఫ్లవర్​ పాట్​ పేయింటింగ్​, ఫ్లవర్​ బొకే తయారీ, బెస్ట్​ అవుటాఫ్​ వేస్ట్​, ఐస్​క్రీం పుల్లలతో అలంకార వస్తువుల తయారీ, క్రాస్​ స్టిచ్​ మ్యాచ్​ వర్క్​, పర్సులు, బ్యాగుల తయరీ, ఉలర్​ వర్క్​, క్రోషియా వర్క్​, మిర్రర్​ వర్క్​, మోతీ వర్క్​, జర్దోసి వర్క్​, రిబ్బర్​ వర్క్​, చమ్కీ వర్క్​, మెహందీ, శ్లోకాలు కథలు, పద్యాలు, మ్యాజిక్​, గ్రీటింగ్​ కార్డుల తయారీ, స్కేటింగ్​, యోగా, కర్రసాములో శిక్షణ ఇస్తారు.

Bal Bhavan Summer Classes | విద్యార్థులకు సదవకాశం..

photototo

వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు ఇదొక సదవకాశం. వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వ విద్యార్థులు (Government School Students) తమ బోనఫైడ్​ సర్టిఫికెట్​ తీసుకొస్తే ఫీజులో రాయితీ ఇస్తాం. చిన్నారుల కోసం బాల్​భవన్​లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. 14 మంది వరకు ఇన్​స్ట్రక్టర్లు ఉన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించవచ్చు.

– ఉమాబాల, పర్యవేక్షకురాలు, బాలభవన్

ఇది కూడా చదవండి..: Gas Cylinder Shortage | నగరంలో గ్యాస్​ కోసం వినియోగదారుల ఆందోళన

Ramzan Celebrations Nizamabad | ఘనంగా రంజాన్​ వేడుకలు.. మైనారిటీల ప్రార్థనలు..
Nagi Reddy Pet Congress | గ్రామాల్లో కాంగ్రెస్​ పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. గ్రామాధ్యక్షుల నియామకం
Varshith Reddy Felicitation | ముచ్కూర్ ముద్దుబిడ్డకు ఘన నీరాజనం
Elderly Mother Complaint | కన్నోళ్లు పట్టించుకుంటలేరు.. ఓ తల్లి ఆవేదన.. ప్రజావాణిలో ఫిర్యాదు
Sub Collector Saves Woman | ఆత్మహత్యాయత్నం చేసిన యువతి.. ట్యాంక్​ ఎక్కి ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్
TAGGED:art dance classes kidsBal BhavanBal Bhavan Summer Classeschildren skill developmentGovernment School Studentsholiday camps indiakids training programsstudent summer trainingsummer activities indiasummer camp nizamabadSummer Holidays
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Trump War Statement Trump War Statement | యుద్ధం ముగింపుపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
Next Article Revanth Reddy Campaign Revanth Reddy Campaign | పినరయి విజయన్, మోదీ ఒక్కటే : సీఎం రేవంత్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?