Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: New Income Tax Rules | అమలులోకి కొత్త ఐటీ రూల్స్.. మీ టేక్ హోమ్ శాలరీపై ప్రభావమెంత?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - New Income Tax Rules | అమలులోకి కొత్త ఐటీ రూల్స్.. మీ టేక్ హోమ్ శాలరీపై ప్రభావమెంత?

జాతీయం

New Income Tax Rules | అమలులోకి కొత్త ఐటీ రూల్స్.. మీ టేక్ హోమ్ శాలరీపై ప్రభావమెంత?

కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో మీ శాలరీ స్లిప్‌లో లెక్కలు మారే అవకాశాలున్నాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 12:34 సా.
Srinivas Kolluri
11 గంటలు ago
Share
New Income Tax Rules

అక్షరటుడే, వెబ్​డెస్క్: New Income Tax Rules | ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను నిబంధనలను ఏప్రిల్ ఒకటో తేదీనుంచి అమలులోకి తెచ్చింది. ఉద్యోగి వస్తు రూపంలో పొందే ప్రయోజనాల విలువను దీనిలో సవరించింది. దీని ప్రకారం ఉద్యోగులకు కంపెనీ ఇచ్చే కారు, డ్రైవర్, ఇతర విలాసవంతమైన సదుపాయాలపై పన్ను భారం పెరగనుంది. అంటే సదరు ఉద్యోగి ఆదాయం ఏమాత్రం పెరగకపోయినా ట్యాక్సబుల్ ఇన్‌కమ్ (Taxable Income) మాత్రం పెరగనుంది.

Contents
  • New Income Tax Rules | కంపెనీ కారు.. భారమే!
    • New Income Tax Rules | వోచర్ల విషయంలో ఊరట..
      • New Income Tax Rules | హెచ్​ఆర్ఏ.. బెనిఫిట్..
        • పిల్లల చదువులకు..
        • విదేశీ ప్రయాణాలకు..

ఇది వారి టేక్ హోమ్ శాలరీ (Take-home salary)పై ప్రభావం చూపనుంది. ప్రభుత్వం ఈ మార్పుల ద్వారా ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. విలాసవంతమైన కార్పొరేట్ జీవనశైలి కావాలంటే పూర్తి మార్కెట్ ధర చెల్లించి పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే మీల్ వోచర్లు, గిఫ్ట్ వోచర్ల విషయంలో మాత్రం ఊరట లభించనుంది. మొత్తానికి ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త ఆదాయపు చట్టం ఇన్ హ్యాండ్ శాలరీపై మరియు ఖర్చులపై మిశ్రమ ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేస్తున్నారు.

New Income Tax Rules | కంపెనీ కారు.. భారమే!

కొత్త ఆదాయపు పన్ను(New Income Tax) నిబంధనల ప్రకారం కంపెనీ కారు వాడుతున్న వారికి ఇబ్బందే. 1.6 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం ఉన్న కారును ఆఫీస్, వ్యక్తిగత అవసరాలకోసం వాడుతుంటే.. దాని పన్ను విలువను రూ. 1,800 నుంచి రూ. 5 వేలకు పెంచారు. అంటే నెలకు అదనంగా రూ. 3,200 ఆదాయానికి కలిసినట్లు లెక్కగడతారు. అదే 1.8 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం గల ఎస్‌యూవీ వాడుతూ, డ్రైవర్‌ను కూడా కలిగి ఉంటే.. సదరు ఉద్యోగి ట్యాక్సబుల్ ఇన్‌కమ్ నెలకు రూ. 10 వేల వరకు పెరగనుంది.

New Income Tax Rules | వోచర్ల విషయంలో ఊరట..

కొత్త పన్ను నిబంధనల్లో ఉద్యోగులకు కొన్ని సానుకూల విషయాలూ ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని మీల్ వోచర్ల పరిమితిని పెంచారు. ఇప్పటివరకు ఒక్కో పూటకు రూ. 50 గా ఉన్న పరిమితిని రూ. 200 లకు పెంచారు. గిఫ్ట్ వోచర్ల పరిమితి రూ. 15 వేలకు పెంచడం కూడా ఉద్యోగులకు కలిసొచ్చే అంశమే. అలాగే కంపెనీ నుంచి తీసుకునే వడ్డీ లేని రుణాల పరిమితిని రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంచడం గమనార్హం. ఇది అత్యవసరాల కోసం చిన్న మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకునే ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశం.

New Income Tax Rules | హెచ్​ఆర్ఏ.. బెనిఫిట్..

ఇప్పటివరకు మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై వాసులకు మాత్రమే 50 శాతం హెచ్​ఆర్ఏ మినహాయింపు ఉండేది. కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె నగరాలనూ ఈ జాబితాలో చేర్చారు. దీనివల్ల ఆయా నగరాల్లో నివసించే ఐటీ, ఇతర రంగాల ఉద్యోగుల పన్ను భారం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.

పిల్లల చదువులకు..

పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్ మినహాయింపును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరు నెలకు కేవలం రూ. 100 గా ఉన్న మినహాయింపును ఏకంగా రూ. 3 వేలకు పెంచడం గమనార్హం.

విదేశీ ప్రయాణాలకు..

విదేశాలకు వెళ్లాలనుకునే వారికి తీపి కబురు అందించింది. ఓవర్సీస్ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ ను 20 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. దీనివల్ల విదేశీ ప్రయాణాలు చేసేవారికి ముందస్తుగా చెల్లించాల్సిన సొమ్ము తగ్గుతుంది.

ఇది కూడా చదవండి..: Market Recovery Bonus Fake | రూ. 10వేల ‘మార్కెట్ రికవరీ బోనస్​’.. ఉత్త ఫేక్ న్యూస్

Reels Stunt Death | రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. తుపాకీతో స్టంట్ చేస్తూ యువకుడు మృతి
LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!
New Governors Appointed | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్​లు.. తెలంగాణ గవర్నర్​గా శివప్రతాప్​ శుక్లా
Market Recovery Bonus Fake | రూ. 10వేల ‘మార్కెట్ రికవరీ బోనస్​’.. ఉత్త ఫేక్ న్యూస్
Judiciary Corruption Chapter | 8వ తరగతిలో “న్యాయవ్యవస్థలో అవినీతి” పాఠ్యాంశం.. ఎన్​సీఈఆర్టీపై సుప్రీంకోర్టు మండిపాటు
TAGGED:employee tax rulesfinancial planning indiahra benefits indiaincome tax update 2026india tax newsNew Income TaxNew Income Tax Rulessalary tax changes indiatake home salary impactTake-home salaryTaxable Income
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Revanth Reddy Campaign Revanth Reddy Campaign | పినరయి విజయన్, మోదీ ఒక్కటే : సీఎం రేవంత్​రెడ్డి
Next Article Jagan Targets Chandrababu Jagan Targets Chandrababu | దోపిడి చేయడమే చంద్రబాబు పని : మాజీ సీఎం జగన్
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Assam Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?