అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagan Targets Chandrababu | చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YSRCP chief Jagan) విమర్శించారు. పరిపాలన అంటే బాబు దృష్టిలో దోపిడీ, అవినీతి మాత్రమే అని ఆరోపించారు.
చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని జగన్ అన్నారు. అమరావతి (Amaravati) చట్టబద్ధత తీర్మానం విషయంలోనూ డ్రామాలు ఆడారన్నారు. తాను చేసే దోపిడీనుంచి డైవర్ట్ చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. రాజధానిపై తీర్మానం అవసరం లేదని మంత్రి పార్థసారథి స్టేట్‌మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు.
Jagan Targets Chandrababu | రాజ్యాంగంలో ఉందా..
రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని అనే పదం ఉందా అని జగన్ ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌కు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదని, ఆయా రాష్ట్రాలే నిర్ణయించుకున్నాయని చెప్పారు. 2019 ముందు మాస్టర్‌ప్లాన్ ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు.
Jagan Targets Chandrababu | రూ.2 లక్షల కోట్లు కావాలి
అమరావతిలో రోడ్లు, డ్రెయినేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందని జగన్ అన్నారు. చంద్రబాబు(Chandrababu) లెక్కలే ఈ వివరాలు చెబుతున్నాయన్నారు. ఆ లెక్కన లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కావాలన్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్నారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు అవసరం లేదన్నారు. దేశంలో అతిపెద్ద స్కామ్ అమరావతి క్యాపిటల్ అన్నారు. 2018లో ఎవరు ఏ పనులు చేశారో.. 2024 తర్వాత అవే కంపెనీలకు బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: Goods Train Derailment | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
