అక్షరటుడే, ఇందూరు : Ayyappa Blessings | అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతోనే తాను ఎమ్మెల్యేగా ఎదిగానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అయ్యప్ప జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నగరంలోని అయ్యప్ప ఆలయంలో (Ayyappa Temple) స్వామివారిని దర్శించుకున్నారు.
Ayyappa Blessings | అయ్యప్ప ఎంతో మహిమాన్వితుడు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) మాట్లాడుతూ.. ఇందూరు అయ్యప్ప ఎంతో మహిమాన్ముతుడని, కొలిచిన వారికి అండగా నిలుస్తాడని తెలిపారు. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చేసిన అలంకరణ ఎంతో ఆకట్టుకుందన్నారు. మండల పూజ సమయంలో నగరంలోని అనేక పడిపూజలకు హాజరవుతానని, అది ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. అయ్యప్పను నమ్మినవారికి కొండంత అండగా నిలుస్తాడని పేర్కొన్నారు.
Ayyappa Blessings | యువత ఆధ్యాత్మికం వైపు..
యువత ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ధన్పాల్ అన్నారు. అలాగే గురువారం జరిగే హనుమాన్ శోభాయాత్ర (Hanuman Shobhayatra)కు భక్తులు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. అనంతరం భజన బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి రమేష్ గురుస్వామి, గుండయ్య స్వామి, భక్తులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Gas Cylinder Shortage | నగరంలో గ్యాస్ కోసం వినియోగదారుల ఆందోళన
