Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Assam Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Assam Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

జాతీయం

Assam Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అస్సాంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాము గెలిస్తే యూనిఫామ్ సివిల్​ కోడ్​ అమలు చేస్తామన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 1, 2026 3:21 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
Assam Uniform Civil Code

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assam Uniform Civil Code | బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే అస్సాం (Assam)లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) హామీ ఇచ్చారు. ఆరో షెడ్యూల్ కింద గిరిజనులకు రక్షణ కల్పిస్తామన్నారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా గోఘాముఖ్‌లో ప్రధాని మోదీ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ అస్సాం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ​శించారు. అస్సాంలో చొరబాట్లను ఆ పార్టీ ప్రోత్సహించిందన్నారు.

Contents
  • Assam Uniform Civil Code | విభజించడానికి యత్నం
    • Assam Uniform Civil Code | రాహుల్‌పై విమర్శ
      • Assam Uniform Civil Code | ఉపాధి అవకాశాలు

అస్సాంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్​ సాధించాలని బీజేపీ  భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ ప్రచారంలో దూసుకు పోతుంది. ఇందులో భాగంగా మోదీ సైతం ర్యాలీలు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. మోదీ మాట్లాడుతూ.. అస్సాంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, చొరబాటుదారులకు రక్షణ కల్పించే లక్ష్యంతో చట్టాన్ని తీసుకువస్తుందని ఆరోపించారు.

Assam Uniform Civil Code | విభజించడానికి యత్నం

దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మోదీ ఆరోపించారు. మెజారిటీ వర్గాన్ని మైనారిటీగా మార్చి, చొరబాటుదారుల శాశ్వత ఓటు బ్యాంకును సృష్టించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. చొరబాటుదారులను రక్షించడానికి అస్సాంలో కొత్త చట్టాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్ (Congress) నాయకులు బహిరంగంగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పదేళ్ల పాలనలో ‘సేవ’ ‘సుపరిపాలన’ కొత్త శకానికి నాంది పలికిందన్నారు.

Assam Uniform Civil Code | రాహుల్‌పై విమర్శ

అస్సాం ఎన్నికల్లో బీజేపీ (BJP) హ్యాట్రిక్ సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో వంద ఓటములను చవిచూస్తుందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఆయనను “కాంగ్రెస్ స్వీయ-ప్రకటిత యువరాజు” అని అభివర్ణించారు. ఆయనకు వందో ఓటమి తప్పదని పేర్కొన్నారు.

Assam Uniform Civil Code | ఉపాధి అవకాశాలు

బీజేపీ మేనిఫెస్టోను ప్రధాని వివరించారు. యువతకు భారీ ఎత్తున ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అస్సాంలో ఇప్పటికే 22 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు లభించాయని మోదీ తెలిపారు. అదనంగా మరో 15 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లను సమకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు కిండర్‌గార్టెన్ స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ఉచిత విద్యను అందించే దిశగా కృషి చేస్తామని ప్రకటించారు.

ఇది కూడా చదవండి..: New Income Tax Rules | అమలులోకి కొత్త ఐటీ రూల్స్.. మీ టేక్ హోమ్ శాలరీపై ప్రభావమెంత?

IRCTC Summer Tours | సమ్మర్ టూర్‌కు ఐఆర్‌‌సీటీసీ రెడీ.. హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
India Gas Shortage | గ్యాస్​ కొరత అధిగమించడానికి కేంద్రం కీలక చర్యలు
LPG Ship India | గ్యాస్​ కష్టాలకు చెక్​… భారత్‌కు చేరిన మరో ఎల్పీజీ నౌక
India Minimum Wage | వారి వేతనాల పెంపు.. ఏప్రిల్​ 1వ తేదీ నుంచి అమల్లోకి!
TAGGED:Assam developmentassam electionsAssam housing schemesAssam Uniform Civil CodeBJP manifestoemployment in AssamModi rallyRahul Gandhi criticismUniform Civil Code
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hanuman Shobha Yatra Hanuman Shobha Yatra | హనుమాన్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు.. రూట్​మ్యాప్​ ఇదే..
Next Article Guest Faculty Salaries | Guest Faculty Salaries | గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనవెతలు.. ప్రిన్సిపాళ్ల మొండివైఖరితో ఇబ్బందులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?